
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ సైకో స్థానికులపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న ఇద్దరు పాఠశాల విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో శనివారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై పోలీసులు సమాచారం ఇస్తూ.. నరేలా ప్రాంతంలోని రామ్‌దేవ్ చౌక్‌లో ఇద్దరు బాలురపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసినట్లు తమకు పీసీఆర్ కాల్ వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పాఠశాల విద్యార్థులతో సహా ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. బాధితులను 11 ఏళ్ల చమన్, రాజేష్‌గా, నిందితుడిని 23 ఏళ్ల వినయ్‌గా గుర్తించారు.
పాఠశాల విద్యార్థి చమన్‌కు ఎడమ భుజం దగ్గర వీపుపై గాయాలు కాగా.. విజయ్ దాడి నుండి తప్పించుకోగా స్వల్ప గాయాలయ్యాయి. రాజేష్ అనే వ్యక్తికి తల, ముఖం, చేతిపై అనేక గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు వినయ్ .. మానసిక స్థితి సరిగా లేదని, ఈ దాడి అనంతరం అతడ్ని ప్రజలు కొట్టి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు తెలిపారు. గాయపడిన ముగ్గురిని ఎస్‌ఆర్‌సి ఆసుపత్రిలో చేర్పించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. దాడిలో గాయపడిన బాధితుల కోసం మెడికో లీగల్ కేసు (MLC) నిర్వహించారు. ఈ దాడికి ఎలాంటి నిర్దిష్ట కారణం లేదనీ, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
భార్య చేతులు నరికి పారిపోయిన భర్త
ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో మరో సంచలన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోటల్‌లో ఓ వ్యక్తి తన భార్య చేతిని నరికి చంపాడని పోలీసులు శనివారం తెలిపారు. ఘటనకు పాల్పడిన అనంతరం నిందితుడు పరారయ్యారు. దంపతులు ఓ హోటల్‌లో ఉంటున్నారని, శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. దంపతులను కాన్పూర్ నుంచి వచ్చిన సతీష్, వందనగా గుర్తించారు. ఇద్దరూ ఆదర్శ్‌నగర్‌లోని ఓ హోటల్‌లో బస చేశారు.