
భారత అంతరిక్ష సంస్థ (ISRO)ఉత్సాహంతో ఊరుకలేస్తోంది. చంద్రుని దక్షిణ ధ్రువం పై చంద్రయాన్ 3 మిషన్ ను విజయవంతంగా దించడంలో ఇస్రో సఫలీకృతమైంది. తక్కువ ఖర్చుతో .. అది కూడా చంద్రుని ఉపరితలంపై ఎవరు కూడా కాలు మోపని ప్రదేశంలో ఇస్రో తన మిషన్ ను సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ చేసింది. రిమార్కేబుల్ హిస్టరీని క్రియేట్ చేసింది. ఈ ప్రయోగ విజయం అందించిన ఉత్సాహంతో మరో ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమవుతోంది ఇస్రో. ఆ ప్రయోగమే గగన్ యాన్ (Gaganyaan). ఈ గగన్‌యాన్ మిషన్ లేదా ప్రయోగాన్ని అతి త్వరలో ప్రయోగించనున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.
అయితే తాజాగా.. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ గగన్యాన్ (Gaganyaan) ప్రయోగం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గగన్‌యాన్ మిషన్ లో భాగంగా మహిళ రోబో (Female Robot) వ్యోమిత్ర (Vyommitra) ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు కేంద్రమంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు. ఈ రోబో మనిషి లాగానే అన్ని పనులను నిర్వహించగలరని, ఈ ప్రయోగం విజయవంతం అయితే.. తర్వాతి ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తామని తెలిపారు. అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో గగన్‌యాన్ తొలి ట్రయల్ రన్‌ను ఇస్రో చేపట్టనుందని కేంద్రమంత్రి తెలిపారు.