
ముంబయి : రోగుల ప్రాణాలు కాపాడాల్సిన Medical students దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఇద్దరు యువకులు ముఠాగా ఏర్పడి పూణేలోని హడాప్సర్, కొత్ రుడ్ ప్రాంతాల్లోని Jewelry storesలో దొంగతనం చేశారు. ఒక యువకుడు నగలు కొనేందుకు వచ్చినట్లుగా నటించి వ్యాపారిని ఏమార్చి బంగారం ఉంగరాలతో బయటకు వచ్చాడు. అదే సమయంలో దుకాణం బయట మరో యువకుడు ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
అనంతరం ఇద్దరు పరారయ్యారు. ఈ ఘటనపై నగల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఆధారాలతో ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 2.5 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు లాతూర్ కు చెందిన అంకిత్ హనుమంత్ రొకాడే (23), మరొకరు వాశిం జిల్లాకు చెందిన వైభవ్ సంజయ్ జగ్ తాప్ (22)గా పోలీసులు గుర్తించారు.
వైద్య విద్య అభ్యసిస్తున్న వీరు జల్సాల కోసంTheftsకు అలవాటు పడ్డారని తెలిపారు. తమ ప్రియురాళ్లకు కానుకగా ఇవ్వడానికి ఉంగరాలను దొంగతనం చేశామని నిందితులు అంగీకరించారని చెప్పారు.
ఇదిలా ఉండగా, బుధవారం హైదరాబాద్ లో అచ్చు సినీ పక్కీలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెడితే.. గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఫ్లాట్‌లో CBI officials సోదాలు చేపట్టారు. సీబీఐ అధికారుల పేరుతో నటిస్తూ నలుగురు వ్యక్తులు 1,340 గ్రాముల బంగారు ఆభరణాలు, డైమండ్ సెట్లు, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారంనాడు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ Professional exploitation ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనపై రియల్టర్ భార్య భాగ్యలక్ష్మి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నానక్రామ్‌గూడలోని Jayabheri Orange Countyలోని తన అపార్ట్‌మెంట్‌కు సోమవారం మధ్యాహ్నం నలుగురు వ్యక్తులు వచ్చారని, వారు తమను తాము సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారని ఆమె తెలిపారు.
డిమాండ్ చేయకున్నా.. తల్లిదండ్రులు ఇచ్చే కానుకలు వరకట్నం కాదు: కేరళ హైకోర్టు తీర్పు
పోలీసులు నమోదు చేసుకున్న ఎఫ్ఐఆర్ ప్రకారం, ఈ నలుగురు వ్యక్తులు మారుతీ సుజుకి ఎర్టిగాలో వచ్చారు. వెంటనే అచ్చం సినీ పక్కీలో తమ ఐడి కార్డులను ఫ్లాష్ చేసి ఇంట్లోకి ప్రవేశించారు. వెంటనే హడావుడి చేస్తూ మహిళను , ఆమె ముగ్గురు పిల్లలను కదలకుండా ఒక్కచోట కూర్చోమని అడిగారు. వారి డ్రైవర్లను హాల్‌లో ఉండమని చెప్పారు.
ఆ తరువాత “వారు బెడ్‌రూమ్‌లోకి వెళ్లారు. మొత్తం సోదా చేశారు. హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న లాకర్ కీలను తీసి లాకర్‌ని తెరిచారు. అందులోని కొంత నగదుతో పాటు కుటుంబానికి చెందిన బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత వాటితో ఉడాయించారు’’ అని పోలీసులు తెలిపారు. ఆ మహిళ తాను మోసపోయానని గ్రహించేందుకు సమయం పట్టింది. సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసేందుకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.