శ్రీకృష్ణ జన్మభూమి వివాదం : భూసర్వేకు మధుర కోర్ట్ ఆదేశం.. జనవరి 20 వరకు డెడ్‌లైన్

By Siva KodatiFirst Published Dec 24, 2022, 3:15 PM IST
Highlights

దేశవ్యాప్తంగా హిందూ, ముస్లింలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న శ్రీకృష్ణ జన్మభూమి స్థల వివాదంపై మథుర కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని చెబుతూ.. జనవరి 20 వరకు డెడ్‌లైన్ విధించింది. 

శ్రీకృష్ణ జన్మభూమి స్థల వివాదంపై మధుర కోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని ఆదేశించింది. జనవరి 20 లోగా సర్వే పూర్తి చేయాలని కోర్ట్ స్పష్టం చేసింది. షాహీ ఈద్గాలో వున్న 13.37 ఎకరాలు అప్పగించాలని హిందూ సంఘాలు పిటిషన్ వేశాయి. దీనిపై విచారించిన మధుర కోర్ట్ కీలక తీర్పును వెలువరించింది. 

ALso REad: తెరపైకి శ్రీకృష్ణ జన్మభూమి వివాదం: అసదుద్దీన్ ఒవైసీ స్పందన ఇది

కాగా.. మధురలోని భగవాన్ శ్రీకృష్ణ జన్మస్థలంగా భావిస్తున్న 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై వివాదం మొదలైంది. అందువల్ల శ్రీకృష్ణ జన్మస్థలంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో వున్న మసీదును తొలగించాలని హిందూ సంఘాలు కోరుతున్నారు. క్రీస్తుశకం 17వ శతాబ్ధంలో మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇక్కడి మసీదును నిర్మించారని వారు చెబుతున్నారు. అయితే 1969లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వాహణ కమిటీ, షాహీ ఈద్గా మసీదు వద్ద ఓ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈద్గాకు స్థలాన్ని ఇచ్చేందుకు ఆలయ కమిటీ అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం సరికాదని తాజాగా హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. కృష్ణ జన్మభూమిలోని 13.37 ఎకరాలను తమకు అప్పగించాలని కోరాయి. ఈ క్రమంలోనే భూ సర్వేకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 
 

click me!