చప్పుడు చేయవద్దని వారించినందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను రాయితో కొట్టి చంపిన దుండగులు

By Mahesh KFirst Published Dec 24, 2022, 2:25 PM IST
Highlights

చప్పుళ్లు చేయవద్దని వారించినందుకు కొందరు దుండుగులు ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేశారు. రాయితో కొట్టారు. రక్తస్రావంతో ఆ కానిస్టేబుల్ మరణించారు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కొందరు దుండగులు డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను కొట్టి చంపారు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా అతడిని అక్కడే వదిలేసి ఆ దుండగులు స్పాట్ నుంచి పారిపోయారు. చప్పుళ్లు చేయవద్దని వారిని వారించినందుకు కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఈ ఘటన దామోహ్ జిల్లా కసాయ్ మండి ఏరియాలో చోటుచేసుకుంది.

కసాయ్ మండి ఏరియా దగ్గర ఒక పోలీసు పోస్టు ఉన్నది. ఎస్ఏఎఫ్ సిబ్బంది అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి జవాన్లు ఆ ఔట్‌పోస్టు దగ్గర భోజనం చేస్తూ ఉండగా పెద్ద శబ్దాలు వచ్చాయి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సురేంద్ర సింగ్ బయటకు వచ్చారు. చప్పుళ్లు వస్తున్న వైపు వెళ్లారు. అక్కడ చప్పుళ్లు చేస్తున్నవారిని వారించాడు. చప్పుడు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ దుండగులకు, పోలీసు కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఆ దుండగులు సురేంద్ర సింగ్ తలపై రాయితో  కొట్టారు. ఆ తర్వాత వెంటనే దుండగులు స్పాట్‌ను వదలిపెట్టి పారిపోయారు.

Also Read: ఏపీలో పోలీస్ ఉద్యోగార్ధులకు శుభవార్త: రెండేళ్ల వయస్సు సడలింపునకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్

గాయపడ్డ సింగ్‌ను సమీప హాస్పిటల్‌కు తరలించారు. కానీ, కానిస్టేబుల్ అప్పటికే మరణించాడని వైద్యులు డిక్లేర్ చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ డీఆర్ తేనివార్ తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. కాగా, ఈ ఏరియాలో పోలీసు బలగాలు మోహరించాయి. నిందితులను పట్టుకోవాలని పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చారు.

click me!