మాస్కుల తయారీ ప్లాంట్‌లో 70 మందికి కరోనా: సీజ్, కేసు

By narsimha lodeFirst Published Jun 25, 2020, 8:43 PM IST
Highlights

మాస్కులు తయారు చేసే యూనిట్ లో  పనిచేసే వారిలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. మాస్కులు తయారు చేసే ఫ్యాక్టరీలో 70 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు.


పుదుచ్చేరి:మాస్కులు తయారు చేసే యూనిట్ లో  పనిచేసే వారిలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. మాస్కులు తయారు చేసే ఫ్యాక్టరీలో 70 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు ప్రకటించారు.

బుధవారం నాడు ఒక్క రోజునే  ఈ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వారిలో 70 మందికి కరోనా సోకినట్టుగా తేలింది.  ఈ విషయం వెలుగు చూడడంతో పుదుచ్ఛేరి సీఎం వి. నారాయణస్వామి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కరోనా నిబంధనలు పాటించకుండా ఫ్యాక్టరీని నడపడం వల్లే 70 మంది కరోనా బారినపడ్డారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

70 మందికి కరోనా సోకడానికి కారణమైన ప్లాంట్ ను వెంటనే సీల్ చేయాలని  ఆదేశాలు జారీ చేశారు. కంపెనీ నడుపుతున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టుగా సీఎం తెలిపారు. 

వైరస్ సోకిన రోగులు ఏ గ్రామాల నుండి వచ్చారనే విషయాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాదు కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్నవారిని కూడ గుర్తించి వారికి కూడ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరిలో 461 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 276 యాక్టివ్ కేసులుగా గణాంకాలు చెబుతున్నాయి.

click me!