చైనాతో కాంగ్రెస్ లింక్స్: కేంద్ర మంత్రి రవిశంకర్ సంచలన ఆరోపణలు

Published : Jun 25, 2020, 04:43 PM ISTUpdated : Jun 25, 2020, 04:55 PM IST
చైనాతో కాంగ్రెస్ లింక్స్: కేంద్ర మంత్రి రవిశంకర్ సంచలన ఆరోపణలు

సారాంశం

రాజీవ్ గాంధీ ట్రస్టుకు చైనా ఎంబసీ నుండి నిధులు వచ్చాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని  చెప్పారు.  

న్యూఢిల్లీ:  రాజీవ్ గాంధీ ట్రస్టుకు చైనా ఎంబసీ నుండి నిధులు వచ్చాయని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.గురువారం నాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని  చెప్పారు.

కాంగ్రెస్ మేధావులు చైనా కోసమే పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చైనాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలున్నాయని ఆరోపించారు. విదేశాల నుండి ట్రస్టులకు వచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలనే నిబంధన ఉందన్నారు. ఈ నిధులను ఎందుకు ఖర్చు చేశారనే విషయాన్ని కూడ చెప్పాలన్నారు.

కానీ ఈ నిధుల విషయమై రాజీవ్ ట్రస్టు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటన్నారు. ఈ నిబంధనలు తెలిసి కూడ కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలన్నారు.

ఈ నెల 15వ తేదీన చైనా, ఇండియా ఆర్మీ మధ్య చోటు చేసుకొన్న ఘర్షణలో ఇండియాకు చెందిన 20 మంది ఆర్మీ జవాన్లు మరణించారు. 
 

PREV
click me!

Recommended Stories

Interesting Facts : మనం ఏడ్చినప్పుడు ముక్కు ఎందుకు కారుతుంది..?
UPSC Interview Questions : గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగానే ఎందుకు మారతాయి..?