గాల్వన్ ఘర్షణలో మరో ఇండియన్ జవాన్ మృతి

Published : Jun 25, 2020, 06:33 PM ISTUpdated : Jun 25, 2020, 06:41 PM IST
గాల్వన్ ఘర్షణలో మరో ఇండియన్ జవాన్ మృతి

సారాంశం

ఈ నెల 15వ తేదీన భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన భారత్ కు చెందిన మరో జవాన్ అమరుడయ్యాడు. మహారాష్ట్రలోని మలేగావ్ తాలుకా సాకురి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే గురువారం నాడు మరణించినట్టుగా ఆర్మీ ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఈ నెల 15వ తేదీన భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన భారత్ కు చెందిన మరో జవాన్ అమరుడయ్యాడు. మహారాష్ట్రలోని మలేగావ్ తాలుకా సాకురి గ్రామానికి చెందిన సచిన్ విక్రమ్ మోరే గురువారం నాడు మరణించినట్టుగా ఆర్మీ ప్రకటించింది.

also read:సంతోష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ పరామర్శ: ఉద్యోగం, ఇంటి స్థలం, రూ. 5 కోట్ల చెక్ అందజేత

గాల్వన్ లోయలో విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే నదిలో పడిపోయిన ఇద్దరిని కాపాడే ప్రయత్నంలో విక్రమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడని గురువారం నాడు ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. దీంతో గాల్వన్ ఘటనలో మరణించిన సైనికుల సంఖ్య 21కి చేరుకొంది. 

also read:కోరుకొన్న శాఖలో ఉద్యోగం: సంతోష్ భార్యకు కేసీఆర్ హామీ

ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు మరణించిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు గాను కమాండర్ స్థాయి అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదమయ్యాయి. రెండు దేశాలు తమ సేనలను వెనక్కి తీసుకోవాలని పరస్పరం ఈ సమావేశంలో కోరాయి. సుమారు 11 గంటలకు పైగా చర్చలు జరిగాయి. చర్చల సారాంశాన్ని ఇటీవల కమాండర్ స్థాయి అధికారులు మీడియాకు వివరించారు. 

ఇదిలా ఉంటే సరిహద్దుల్లోని ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకుందామని ఒకపక్క భారత్‌కు చెబుతూనే మరోపక్క తూర్పు లద్దాఖ్‌ సహా పలు ప్రాంతాల్లో తన బలగాలను విస్తరిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu