మసీదు బానిసత్వానికి చిహ్నం.. దానిని కూల్చే రామ మందిర నిర్మాణం - కర్ణాటక బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

By Sairam Indur  |  First Published Jan 2, 2024, 12:52 PM IST

KS Eshwarappa : రాముడిని ఆరాధించే వారందరికీ ఆయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కోసం ఆహ్వానం అందుతోందని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం ఈశ్వరప్ప అన్నారు. కానీ ‘బీజేపీ రాముడు’ అంటూ విమర్శించేవారికి అందటం లేదని చెప్పారు.


KS Eshwarappa : అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బానిసత్వానికి చిహ్నంగా ఉన్న మసీదును కూల్చివేశారని బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. మథురలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూడా నిర్మిస్తామని చెప్పారు. కర్ణాటకలోని శివమొగ్గలో బీజేపీ విభాగం నిర్వహించిన ఓట్ ఫర్ మోదీ అండ్ సేవ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. 496 ఏళ్ల క్రితం అయోధ్యలో రామమందిరం ధ్వంసమైందని చెప్పారు.

కేటీఆర్ కుర్చీలో హరీష్..? బిఆర్ఎస్ బిగ్ బాస్ కేసీఆర్ స్కెచ్ ఇదేనా?

Latest Videos

మొఘల్ రాజు బాబర్ ఈ ఆలయంపై మసీదును నిర్మించారని ఈశ్వరప్ప అన్నారు. దేవుడి ఆశీస్సులతో తమ జీవితకాలంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనను చూడబోతున్నామని, ఇది ఎంతో అదృష్టమని చెప్పారు. బానిసత్వ చిహ్నం పోయిందని, హిందువుల ఆత్మగౌరవానికి ప్రతిబింబమైన రామాలయాన్ని నిర్మించారని ఆయన అన్నారు.

ఏసియానెట్ ఎక్స్ క్లూజివ్ : అయోధ్య ఎంత అద్భుతంగా మారిపోయిందో చూడండి

అయోధ్యలో పూజించే మంత్రాక్షత్ (పవిత్ర బియ్యం)ను ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తున్నామని ఈశ్వరప్ప తెలిపారు. ఇంట్లో మంత్రాక్షణాన్ని ఉంచి జనవరి 22న దీపావళి పండుగలా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది పవిత్రమైన ఘట్టమని, రాజకీయాల గురించి తాను మాట్లాడబోనని చెప్పారు. శ్రీరాముడి భక్తులకు ఆహ్వానం అందుతోందని తెలిపారు. కానీ అయోధ్యలో ఉంది బీజేపీ రాముడు అని ప్రకటనలు చేస్తున్న నేతలకు మాత్రం ఆహ్వానం అందటం లేదని విమర్శించారు.

లీప్ డే ఫిబ్రవరి 29నే ఎందుకు వస్తుంది? లీప్ ఇయర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

రాముడిని ఆరాధించే వారు, ఆయనను చూసి గర్వపడే వారు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనవచ్చని అన్నారు. రామ మందిర నిర్మాణానికి నిర్ణయం తీసుకున్న సమయంలోనే హిందూ పుణ్యక్షేత్రాలైన కాశీ, మథురలలో సర్వేలు నిర్వహించడానికి కూడా అనుమతి ఇచ్చారని మాజీ డిప్యూటీ సీఎం తెలిపారు. ఇక్కడ కూడా ఆలయాల నిర్మాణానికి కోర్టులో అనుకూల తీర్పు వస్తుందని చెప్పారు. కాశీలోని మసీదును కూల్చివేసి కాశీ మందిరాన్ని నిర్మిస్తామని, మథురలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

click me!