లాక్‌డౌన్‌లో పెరుగుతున్న గృహహింస: స్నానం చేయకుండా పైశాచికం... భర్తపై భార్య ఫిర్యాదు

By Siva Kodati  |  First Published Apr 19, 2020, 6:01 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా దేశంలో గృహ హింస కేసులు, వేధింపులు పెరిగిపోతున్నాయి. ఉదయం ఆఫీసుకు వెళ్తే, అర్థరాత్రుళ్లు తిరిగి వచ్చే భార్యాభర్తలు ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉండటంతో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. 


కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు కేంద్ర  ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా దేశంలో గృహ హింస కేసులు, వేధింపులు పెరిగిపోతున్నాయి. ఉదయం ఆఫీసుకు వెళ్తే, అర్థరాత్రుళ్లు తిరిగి వచ్చే భార్యాభర్తలు ఇప్పుడు 24 గంటలు ఇంట్లోనే ఉండటంతో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి.

భర్తలు పెట్టే హింసలు భరించలేక పలువురు మహిళలు పోలీస్ స్టేషన్‌లకు క్యూలు కడుతుండగా మరికొందరు హెల్ప్‌లైన్ సెంటర్లకు ఫోన్ చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో విచిత్రమైన ఘటన జరిగింది. తన భర్త స్నానం చేయకుండా తనను ఇబ్బంది పెడుతున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Latest Videos

Also Read:రైళ్లు, విమాన సర్వీసులను మే 4 నుంచి ప్రారంభిస్తారా: కోట్లాది మందిని వేధిస్తున్న ప్రశ్న

వివరాలలోకి వెళితే.. బెంగళూరులోని జయనగర్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి కిరాణా షాపు నడుపుతున్నాడు. అయితే లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి షాపు తెరవకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.

అయితే అతను స్నానం చేయకపోవడంతో దుర్వాసన వస్తోందని, అంతేకాకుండా తన గదిలోనే నిద్రించాలని బలవంతం చేస్తున్నాడని అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తను చూసి తన తొమ్మిదేళ్ల కుమార్తె కూడా వారం రోజులుగా స్నానం చేయడం లేదని ఆమె పోలీసులకు వివరించారు.

Also Read:కరోనా: ఇండియాలో 24 గంటల్లో 1,334 కేసులు, మొత్తం 15,712కి చేరిక

వ్యక్తిగగత శుభ్రత గురించి తాను ఎంతగా మొత్తుకున్నా ఆయన పాటించడం లేదని, అంతేకాకుండా గదిలోకి వెళ్లకపోవడంతో తనను కొట్టాడని వివాహిత ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను పిలిపించి వ్యక్తిగత శుభ్రత గురించి కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. 

click me!