లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఏడు కి.మీ నడిచి డెంటల్ ఆసుపత్రిలో ప్రసవం

By narsimha lode  |  First Published Apr 19, 2020, 5:56 PM IST

 కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఓ గర్భిణీ పురిటి నొప్పులతో ఏడు కిలోమీటర్లు నడించింది. చివరకు ఓ డెంటల్ ఆసుపత్రిలో ఆమె ప్రసవించింది. చివరకు ఆమెను బెంగుళూరుకు తరలించారు.తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు.



బెంగుళూరు: కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఓ గర్భిణీ పురిటి నొప్పులతో ఏడు కిలోమీటర్లు నడించింది. చివరకు ఓ డెంటల్ ఆసుపత్రిలో ఆమె ప్రసవించింది. చివరకు ఆమెను బెంగుళూరుకు తరలించారు.తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్టుగా వైద్యులు చెప్పారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మే 3వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించింది. దీంతో కరోనా రోగులకు వైద్యం అందించే ఆసుపత్రులు మినహా ఇతర ఆసుపత్రులు నామమాత్రంగా పనిచేస్తున్నాయి.

Latest Videos

నార్త్ బెంగుళూరుకు చెందిన ఓ కార్మికుడి భార్య గర్భవతి. ఆమెకు నెలలు నిండాయి. ఆమెకు డెలీవరీ కోసం ఆసుపత్రిలో చేరేందుకు భర్తతో కలిసి ఏడు కిలోమీటర్ల దూరం నడిచింది. ఇక నడిచే ఓపిక లేకపోవడంతో పాటు పురుటి నొప్పులు పెరగడంతో సమీపంలోని డెంటల్ ఆసుపత్రిలో ఆమెను తీసుకెళ్లాడు భర్త.

తన భార్య పరిస్థితిని అతను డెంటల్ డాక్టర్ రమ్యకు వివరించాడు. దీంతో డెంటల్ డాక్టర్ డెలీవరీ చేశారు. అయితే ఆ మహిళ  ఓ శిశువుకు జన్మనిచ్చింది. అయితే అదే సమయంలో తీవ్ర రక్తస్రావమైంది. మహిళకు రక్తస్రావం కాకుండా వైద్యులు చికిత్స చేశారు. 

పుట్టిన శిశువులో కదలిక లేకుండా పోయింది. ఆమెకు చికిత్స చేసి రక్తస్రావాన్ని అరికట్టారు. అదే సమయంలో శిశువులో కదలిక వచ్చింది. వెంటనే తల్లీబిడ్డలను బెంగుళూరులోని ప్రధాన ఆసుపత్రికి తరలించారు. 

also read:కరోనా: ఇండియాలో 24 గంటల్లో 1,334 కేసులు, మొత్తం 15,712కి చేరిక

లాక్ డౌన్ తో  ఆసుపత్రులు మూసిఉండడంతో గర్భిణీ బాధ చూడలేక ప్రసవం చేసినట్టుగా డెంటల్ డాక్టర్ రమ్య తెలిపారు.బెంగుళూరు ఆసుపత్రిలో తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
 

click me!