రైళ్లు, విమాన సర్వీసులను మే 4 నుంచి ప్రారంభిస్తారా: కోట్లాది మందిని వేధిస్తున్న ప్రశ్న

By Siva KodatiFirst Published Apr 19, 2020, 5:21 PM IST
Highlights

దేశంలో కరోనా అంతకంతకూ పెరుగుతుండటంతో మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అయితే అప్పుడైనా రైళ్లు, విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలను ప్రారంభిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. 

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అటు వాళ్లు ఇటు.. ఇటు వాళ్లు అటు వెళ్లడానికి వీలు లేకుండా ఎక్కడి వారు అక్కడే ఇరుక్కుపోయారు.

ఏప్రిల్ 15 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేస్తే తమ స్వగ్రామాలకు వెళ్లిపోవాలని భావించిన వారికి ప్రధాని మోడీ షాకిచ్చారు. దేశంలో కరోనా అంతకంతకూ పెరుగుతుండటంతో మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు.

Also Read:కరోనా: ఇండియాలో 24 గంటల్లో 1,334 కేసులు, మొత్తం 15,712కి చేరిక

అయితే అప్పుడైనా రైళ్లు, విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలను ప్రారంభిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత రాలేదు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు.

రైళ్లు, విమానాలు నడిపేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైనా తేదీని నిర్ణయించిందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ఏదో ఒక రోజు అన్ని రకాల సేవలను పునరుద్ధరించాలని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతానికి అది ఏ రోజన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని జవదేకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దీని గురించి చర్చించడం ఫలితం లేనిదే అవుతుందని.. తాము పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: వైద్యం అందక ముంబైలో లాయర్ మృతి

కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రారంభం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాతే విమానయాన సంస్థలు బుకింగ్స్ ప్రారంభించాలని హర్దీప్‌సింగ్ చెప్పారు. మే 4 నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మళ్లీ ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 

click me!