మోదీ హత్యకు కుట్రపన్నలేదు:మావోలు లేఖ విడుదల

By Nagaraju TFirst Published Oct 1, 2018, 3:38 PM IST
Highlights

పౌర హక్కుల నేతలను అరెస్ట్ చెయ్యడంపై మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. 
 

ఢిల్లీ: పౌర హక్కుల నేతలను అరెస్ట్ చెయ్యడంపై మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ అభయ్ పేరుతో లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. 

ప్రధాని నరేంద్రమోదీని హతమార్చేందుకు మావోయిస్టులు కుట్రపన్నారంటూ చేసిన అభియోగంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. పౌరహక్కుల నేత విల్సన్ దగ్గర దొరికిన లేఖలన్నీ భూటకమని తేల్చిచెప్పారు. అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్నిఖూనీ చేస్తోందని లేఖలో ఆరోపించారు. 

భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావుతోపాటు మరో ఐదుగురి ఇళ్లపై పుణె పోలీసులు దాడులు నిర్వహించడంతో పాటు వారిని అరెస్ట్ చేసి.. పుణెకు తరలించారు. అయితే ఈ కేసులో అరెస్టయిన పౌరహక్కుల నేతలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 

ఈ కేసులో అరెస్టులు కాకుండా గృహనిర్భందాలు మాత్రమే విధించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను అత్యున్నత ధర్మాసనం జారీ చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

వరవరరావు ఇంటి వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

చంద్రబాబుకు సోమవారం నోటీసులు: హీరో శివాజీ సంచలనం

వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు.. ఐపీఎస్‌పై సుప్రీం కన్నెర్ర

ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

click me!