మా టార్గెట్ జవాన్లే.. డీడీ కెమెరామన్‌ను కావాలని చంపలేదు: మావోలు

By sivanagaprasad kodatiFirst Published Nov 2, 2018, 12:54 PM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో తాము జరిపిన కాల్పుల్లో డీడీ కెమరామన్ అచ్యుతానంద్ మరణించడంపై మావోయిస్ట్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఒక ప్రకటన విడుదల చేసింది.

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో తాము జరిపిన కాల్పుల్లో డీడీ కెమరామన్ అచ్యుతానంద్ మరణించడంపై మావోయిస్ట్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ఒక ప్రకటన విడుదల చేసింది.

మీడియా కానీ, డీడీ కెమెరామన్ అచ్యుతానంద్ సాహూ కానీ తమ టార్గెట్ కాదని పేర్కొంది. ‘‘ ప్రతీరోజు మా గ్రామాలపై దాడులు జరుగుతున్నాయి.. స్థానికులను కొట్టడం, బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపడం, అక్రమ కేసుల్లో జైలుకు పంపడం జరుగుతోంది. కొందరికి మావోయిస్టులన్న ముద్ర వేసి లొంగిపోయినట్లు ప్రకటిస్తున్నారు.. ఇదంతా ఒక సాధారణ ప్రక్రియగా మారిపోయింది.

రాజకీయ పార్టీలు కూడా మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. ప్రతి రోజులాగే అక్టోబర్ 30న కూడా తమపై పోలీసులు దాడికి దిగారని.. తాము వాటిని తిప్పికొట్టామని.. అయితే దూరదర్శన్ బృందం కూడా భద్రతా సిబ్బందితో పాటు ఉందన్న విషయం తమకు తెలియదని.. తప్పనిసరి పరిస్థితుల్లో జరిపిన కాల్పులే సాహూ మరణానికి దారి తీసిందని స్పష్టం చేశారు.

అలాగే జర్నలిస్టులు పోలీసులకు దూరంగా ఉండాలని.. ముఖ్యంగా ఎన్నికల డ్యూటీలో ఉన్న భద్రతా సిబ్బందితో కలిసి ప్రయాణించవద్దని మావోలు సూచించారు. మరోవైపు నక్సల్స్ లేఖను దంతెవాడ జిల్లా ఎస్పీ ఖండించారు..

డీడీ కెమెరామన్‌ వారి టార్గెట్ కాకపోతే.. కెమెరా ఎందుకు ఎత్తుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండబట్టే అలా జరిగిందని.. పొరబాటు జరిగిందనడానికి ఎలాంటి ఆస్కారం లేదని ఆయన అన్నారు.

మంగళవారం ఉదయం ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలను కవర్ చేయడానికి దూరదర్శన్ ప్రతినిధి బృందం.. దంతెవాడ జిల్లా అరుణ్‌పూర్ గ్రామంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో కూంబింగ్ జరుపుతున్న భద్రతా సిబ్బందితో కలిసి దట్టమైన అటవీ మార్గంలో వెళుతుండగా మాటు వేసిన మావోలు వీరిపై దాడి చేశారు.

ఈ ఘటనలో ముగ్గురు జవాన్లతో పాటు డీడీ కెమెరామన్ అచ్యుతానంద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు చుట్టుముట్టినప్పటినా.. కొనఊపిరితో పోరాడుతూ.. అచ్యుతానంద్ విధులు నిర్వర్తించి కన్నుమూశారు. తుది ఘడియాల్లో ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

మావోల దాడి...చనిపోతూ విధులు నిర్వహించిన డీడీ కెమెరామన్

మావోల మెరుపుదాడి.. ఇద్దరు జవాన్లు, డీడీ కెమెరామన్ మృతి
 

click me!