మోడల్ తో అక్రమ సంబంధం..భార్యను అడ్డు తప్పించేందుకు

Published : Nov 02, 2018, 12:20 PM IST
మోడల్ తో అక్రమ సంబంధం..భార్యను అడ్డు తప్పించేందుకు

సారాంశం

మంజీత్.. ఢిల్లీకి చెందిన మోడల్ ఏంజెల్ గుప్తాతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. 

మోడల్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి.. కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చి మరీ భార్యను  అంతమొందించాడు. ఈ సంఘటన  దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  ఢిల్లీకి చెందిన సునీత(38), మంజీత్(38) భార్య భర్తలు. వీరికి ఇద్దరు సంతానం.

సునీత ఢిల్లీలోని ఓ ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. కాగా.. కొద్ది రోజుల క్రితం ఆమె దారుణ హత్యకు గురయ్యింది. స్కూల్ కి వెళుతుండగా ఆమె పై ఎవరో కాల్పులు జరిపి హత్య చేశారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో నమ్మలేని నిజాలు తెలిశాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజీత్.. ఢిల్లీకి చెందిన మోడల్ ఏంజెల్ గుప్తాతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.  ఈ విషయంలో తరచూ భార్య భర్తలకు గొడవలు జరుగుతన్నాయి. కాగా.. భార్య అడ్డు తప్పించుకుంటే తప్ప.. ప్రియురాలితో సంతోషంగా ఉండలేనని భావించిన మంజీత్ కిరాయి హంతకులతో భార్యను చంపించాడు.

కాగా.. పోలీసుల దర్యాప్తులో మంజీత్ అసలు నేరస్థుడు అన్న విషయం తెలిసింది. అతనితో పాటు మోడల్ ఎంజెల్ గుప్తాను కూడా అదుపులోకి తీసుకున్నారు.  కిరాయి హంతకుల కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

TVK Chief Vijay Powerful Speech: స్టాలిన్ కొంపముంచిన విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ ఇదే| Asianet News Telugu
TVK Vijay Visits Church: గెలుపు కోసం చర్చి లో మోకాళ్ళపై నడిచిన విజయ్ వైరల్ వీడియో| Asianet Telugu