ఛత్తీస్‌గడ్‌లో ఎన్‌కౌంటర్ సంభవించింది. పోలీసుల సెక్యూరిటీ క్యాంపుపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో పోలీసు బలగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఐదుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి.
ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని టేకుల గూడెంలో భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన సెక్యూరిటీ క్యాంప్ పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను జగదళ్‌పూర్‌లోని రిఫరల్ హాస్పిటల్‌కు హెలికాప్టర్‌లో తరలించారు.
సుక్మా జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సాధారణం చేయడానికి, స్థానిక ప్రజలకు కనీస వసతులు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు టేకులగూడెం గ్రామంలో కొత్తగా సెక్యూరిటీ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ రోజే ఈ సెక్యూరిటీ క్యాంప్‌ను ప్రారంభించారు. అంతలోలనే మావోయిస్టులు ఈ క్యాంప్ పై విరుచుకుపడ్డారు. పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు జవాన్లు గాయపడ్డారు. సుక్మా జిల్లా జగర్‌గుండా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: రాజ్యసభ ఎన్నికలు: వైసీపీ, టీడీపీ బలాబలాలు.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడితే పరిస్థితులు ఏమిటీ?
ఛత్తీస్‌గడ్‌లో పలు జిల్లాల్లో అధిక భాగం నక్సలైట్ల ప్రాబల్యం ఉన్నది. ఇందులో సుక్మా జిల్లా కూడా ఉన్నది.