
న్యూఢిల్లీ: మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పై ఇండియాతో పాటు విదేశాల్లో భారీ స్పందన వచ్చింది. దేశ విదేశాల నుండి 11 లక్షల మంది మన్ కీ బాత్ కార్యక్రమం వింటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో వైపు 9 లక్షల మంది ఈ విషయమై ట్వీట్లు చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత అంతర్జాతీయ రాయబార కార్యాలయాల్లో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను విన్నారు. మరో వైపు ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను విన్నట్టుగా రిపోర్టులు తెలుపుతున్నాయి. మనో కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు విన్నారు.
పలు రాష్ట్రాల రాజ్ భవన్ లలో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వినేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ప్రదర్శనలు కూడా నిర్వహించారు.
also read:మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్: విశాఖ వాసి వెంకట మురళి ప్రసాద్ ను ప్రస్తావించిన మోడీ
దేశవ్యాప్తంగా పలు కమ్యూనిటీ సెంటర్లు, రైల్వే స్టేషన్లలో కూడా మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రసారమైంది. మన్ కీ బాత్ కార్యక్రమం గురించి సినీ తారలు కూడా స్పందించారు. మాధురి దీక్షిత్ షాహిద్ కపూర్, రోహిత్ శెట్టి తదితరులు ముంబైలోని రాజ్ భవన్‌లో మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ను విన్నారు.
లక్నోలోని ఇర్ఫానీ మదర్సా, జామా మసీదు ప్రాంతాల్లో కూడా మన్ కీ బాత్ 100 వఎపిసోడ్ విన్నారు. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ కార్యక్రమం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది