మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడం చట్టవిరుద్ధం కాదు: సుప్రీంకోర్టులో తమిళనాడు

Published : May 01, 2023, 07:14 PM IST
మిషనరీలు క్రైస్తవాన్ని వ్యాప్తి చేయడం చట్టవిరుద్ధం కాదు: సుప్రీంకోర్టులో తమిళనాడు

సారాంశం

మిషనరీలు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం దానికదిగా చట్టవిరుద్ధమేమీ కాదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఎందుకంటే రాజ్యాంగమే పౌరులకు తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఇచ్చిందని వివరించింది. పౌరులూ తమకు ఇష్టమున్న మతాన్ని స్వీకరించే హక్కును కలిగి ఉంటారని తెలిపింది. తమిళనాడులో బలవంతపు మతమార్పిళ్లేవీ లేవని వివరించింది.  

న్యూఢిల్లీ: మిషనరీలు క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం చట్టవిరుద్ధమేమీ కాదని సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత వ్యాప్తిని చేసుకునే హక్కును పౌరులకు ఇచ్చిందని వివరించింది. కాబట్టి, క్రైస్తవ మిషనరీలు మతాన్ని వ్యాప్తి చేయడాన్ని చట్టపరంగా తప్పుగా చూడలేమని తెలిపింది. ఒక వేళ ఆ మత వ్యాప్తి ప్రజా పాలనకు, నైతికతకు, ఆరోగ్యానికి, రాజ్యాంగంలోని మూడో పార్టులో పేర్కొన్న ఇతర నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దాన్ని సీరియస్‌గా చూడాలని వివరించింది.

అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌కు సమాధానంగా డీఎంకే ప్రభుత్వం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో బలవంతంగా మత మార్పిళ్లు జరిగిన ఘటనలేవీ లేవని వివరించింది. పిటిషనర్ చేస్తున్న ఆరోపణలు కొన్ని హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలకు వర్తిస్తాయని తెలిపింది.

పౌరులు తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కును కలిగి ఉంటారని తమిళనాడు ప్రభుత్వ అఫిడవిట్ పేర్కొంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని తన మతంలోకి మార్చడానికి రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఇవ్వలేదని వివరించింది. కానీ, ఏ పౌరుడైనా అతని మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే హక్కును ఇచ్చిందని తెలిపింది. అలాగే, ఏ వ్యక్తి అయినా ఆయనకు ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కును కల్పించిందని పేర్కొంది. కాబట్టి, ఈ దేశ పౌరులు వారికి ఇష్టమైన మతాన్ని స్వేచ్ఛగా ఎంచుకునే అవకాశాన్ని కల్పించాలని వివరించింది. అంతేకానీ, ప్రభుత్వమే దాని వ్యక్తిగత విశ్వాసాలు, ప్రైవసీపై వల్లించడం మానుకోవాలని సూచించింది.

అలాగే, ఎవరైనా సరే ఒకరి మతాన్ని, మత విశ్వాసాలను అవమానించి, ఎదుటి వారిని ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా ఇబ్బంది పెడితే వారిపై చర్యలు తీసుకునే బాధ్యతను మాత్రం ప్రభుత్వం తప్పకుండా నిర్వర్తించాలని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఒక మతంలో విశ్వాసాన్ని ఏర్పరుచుకునే హక్కును ఆర్టికల్ 21లో చూడవచ్చని, ఇది ఉల్లంఘనకు అతీతమైన హక్కు అని వివరించింది.

Also Read: హైదరాబాద్‌లో నీరా అమ్మకానికి కేఫ్.. టేక్ అవే ఆప్షన్ కూడా.. నెక్లెస్‌రోడ్‌లో బుధవారం ప్రారంభం

ఉపాధ్యాయ్ పిటిషనే మతపరమైన ఉద్దేశంతో వేసిన పిటిషన్ అని, యాంటీ కన్వర్షన్ లాను (మత మార్పిడి వ్యతిరేక చట్టం) తీసుకురావాలనే ఆలోచనలూ తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. అలాంటి చట్టాలు మైనార్టీలకు వ్యతిరేకంగా దుర్వినియోగించే ముప్పు ఉంటాయని వివరించింది. ఈ చట్టాల కింద దోషులుగా తేలిన వారి వివరాలు ఏ రాష్ట్రం వద్ద లేవని తెలిపింది.

బెదిరించి, భయపెట్టి, బహుమానాలతో ప్రలోభపెట్టి, డబ్బు ఆశచూపి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారనే పిటిషనర్ వాదనలకు స్పందనగా.. ఈ ఆరోపణలు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ట్రైబల్ ఏరియాలు, ఒడిశా, హిందీ బెల్ట్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలకు సంబంధించినవి మాత్రమే అని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. అంతేకానీ, ఆ ఆరోపణలు తమ రాష్ట్రానికి వర్తించవని స్పష్టం చేసింది.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..