మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Former Prime Minister Manmohan Singh) దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తిండిపోతాయని ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) అన్నారు. ఆయన విధుల పట్ల ఎంతో బాధ్యతగా ఉండేవారని అన్నారు. వీల్ చైర్ (wheelchair)లో వచ్చి కూడా ఓటేశారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు. గురువారం పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ప్రధాని సభలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు పలికారు. వీల్ చైర్ పై వచ్చి కూడా మన్మోహన్ సింగ్ తన బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు.
కుళాయి నుంచి ‘సాంబారు’..ఇదేలా సాధ్యం.. ? వీడియో వైరల్..
‘‘ఈ రోజు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ ను స్మరించుకోవాలనుకుంటున్నాను, ఆయన కృషి ఎనలేనిది. ఇంతకాలం ఆయన ఈ సభను, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ‘‘ఆ రోజు సభలో జరిగింది నాకు గుర్తుంది. ఓటింగ్ సమయంలో ట్రెజరీ బెంచ్ గెలుస్తుందని తెలిసినప్పటికీ.. మన్మోహన్ సింగ్ వీల్ చైర్ లో వచ్చి ఓటు వేశారు. ఓ సభ్యుడు తన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇదొక ఉదాహరణ అన్నారు.’’ అని అన్నారు.
PM Modi lauds the contribution of Former PM Manmohan Singh. pic.twitter.com/bN3oFD1gQu
— sansadflix (@sansadflix)పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ శాశ్వత విశ్వవిద్యాలయంలో వారి ప్రయాణం విలువైన అనుభవాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన ఎంపీలు పొందిన విజ్ఞత దేశాన్ని సుసంపన్నం చేస్తుందని, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తాను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు.
కాగా.. అంతకు ముందు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్ లో గ్రూప్ ఫోటో సెషన్ కోసం సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని చైర్మన్ జగదీప్ ధన్కర్ నివాసంలో పదవీ విరమణ చేసిన సభ్యులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. రాజ్యసభలోని అరవై ఎనిమిది మంది సభ్యులు ఫిబ్రవరి నుంచి మే మధ్య పదవీ విరమణ చేయబోతున్నారు.