Manmohan Singh: 1991లోనే రప్ప.. రప్పాడించాడు

By Modern Tales - Asianet News Telugu  |  First Published Dec 27, 2024, 12:35 AM IST

అప్పటికి దేశం భారీగా రుణాలు తీసుకునే స్థితిలో లేదు. కానీ, తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 5 బిలియన్ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు.


అప్పటికి దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ప్రతి డెసిషన్ గవర్నమెంటు చేతుల్లోనే ఉండేది. ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఉత్పత్తి చేయాలి,  ఎంతమందిని వినియోగించాలి అన్నవన్నీ ప్రభుత్వమే చూసుకునేది. ఈ వ్యవస్థనే లైసెన్స్ రాజ్ అంటారు.అందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించి, ప్రభుత్వ పెట్టుబడులను తగ్గిస్తారు. ఈ ఆర్థిక రిఫార్మ్లను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి  ఉన్న మన్‌మోహన్ సింగ్ సరిగ్గా 33 ఏళ్ల కింందట బడ్జెట్ ప్రవేశపెట్టారు.

1991 బడ్జెట్ హైలైట్స్

  • Latest Videos

    undefined

    దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంపు

  • లైసెన్సింగ్ రాజ్ కు చరమగీతం.

  • ఎగుమతులకు ప్రోత్సాహం , దిదగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులు.

  • ఫారిన్ ప్రత్యక్ష పెట్టుబడులతో ఉద్యోగాలు.

  • సాఫ్ట్‌వేర్ ఎగుమతులకు ప్రోత్సాహం

ఈ బడ్జెట్‌ను ఆధునిక దేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాలలో ఒకటిగా పరిగణిస్తారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌లకు ఈ బడ్జెట్ క్రెడిట్ దక్కింది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 1991 దాకా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రిఫార్మ్ల ఆవశ్యకత ఉందని తెలుసు కానీ, ఈ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఎన్నడూ లేదు.

ఇందిరా గాంధీ 1966లోనే రిఫార్మ్ల కోసం ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు, కలర్ టీవీలను తీసుకువచ్చారు. కాని పూర్తి స్థాయిలో ఆర్థిక రిఫార్మ్ల మార్గంలో ఎప్పుడూ వెళ్ళలేదు.

ఇంతలో, ఆర్థిక సమస్యలు పెరిగాయి.. 1990 నాటికి ఈ సమస్యలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పయనించాయి.

ఆ సమయంలో చంద్రశేఖర్ ప్రధానిగా, యశ్వంత్ సిన్హా ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు.

1989 సార్వత్రిక ఎన్నికల అనంతరం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గవర్నమెంటు ఏర్పడింది. దీన్ని రెండు ఊత కర్రలతో నడుస్తున్న గవర్నమెంటుగా అప్పట్లో చెప్పుకునే వారు. కాంగ్రెస్, బీజేపీలు వీపీ సింగ్ సర్కారుకు మద్దతు ఇచ్చాయి.

అది మరిచిపోలేని దినం

జూన్‌లో నరసింహారావు గవర్నమెంటు ఏర్పడింది. మరుసటి నెలలోనే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ దేశం గతిని మార్చేసింది. సాధారణంగా బడ్జెట్‌ను రెడీ చేయడానికి కనీసం 90 రోజుల సమయం పడుతుంది. కానీ, దానిని నెల రోజుల్లోనే మన్‌మోహన్ సింగ్ సిద్ధం చేశారు. పరిశ్రమల శాఖను తన వద్దే పీవీ ఉంచుకున్నారు. తన సహచరుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయన రిఫార్మ్లు అమలు చేశారు.

కొద్దికాలంలోనే ఫలితాలు కనిపించడం ప్రారంభించాయి. ప్రభుత్వానికి ఆదాయం మొదలైంది. ఫారిన్ పెట్టుబడులు వచ్చాయి.

, మార్కెట్లో మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కోట్ల మంది ప్రజలు మొదటిసారిగా దారిద్య్ర రేఖకు ఎగువకు వచ్చారు.

హీరో పీవీనా మన్మోహనా.

1991 బడ్జెట్‌ను యశ్వంత్ సిన్హా సిద్ధం చేయగా. ఆర్థిక రిఫార్మ్లకు సంబంధించిన అనేక నిర్ణయాలు ఇందులో ఉన్నాయి. ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను సమర్పించాల్సి ఉంది. కానీ గవర్నమెంటు, కాంగ్రెస్‌ల భేదాభిప్రాయల కారణంగా సాధ్యం కాలేదు.

యశ్వంత్ సిన్హాను మధ్యంతర బడ్జెట్ మాత్రమే సమర్పించాలన్నారు. దీంతో యశ్వంత్ సిన్హా రిజైన్ చేశారు.

కానీ, ప్రధాని చంద్రశేఖర్ ఒప్పించడంతో యశ్వంత్ సిన్హా రాజీనామాను ఉపసంహరించుకున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.

కొందరు రిఫార్మ్లు స్లోగా సాగుతున్నాయని వాదిస్తే, మరికొందరు వీటి కారణంగా సమాజంలో ఆర్ధిక అసమానతలు పెరిగాయని అంటారు. అయితే, ఒక్క విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తారు. 30 సంవత్సరాల కిందట తీసుకున్న డెసిషన్ దేశాన్ని భారీ ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

వీపీ సింగ్ ప్రధాని అయిన కొత్తలో, ఖజానా ఖాళీగా ఉందన్నారు. అనంతరం  వీపీ సింగ్ గవర్నమెంటు రిజర్వేషన్ల సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాదిన్నరకు  ఆ గవర్నమెంటు పడిపోయింది. చంద్రశేఖర్ ప్రధాని, యశ్వంత్ సిన్హా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాగా, డాక్టర్ మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారు అయ్యారు.

బంగారం తాకట్టు  పెట్టి మరీ ..

అప్పటికి దేశం భారీగా రుణాలు తీసుకునే స్థితిలో లేదు. కానీ, తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 5 బిలియన్ డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. దానిపై వడ్డీ చెల్లించడానికి కూడా డబ్బు లేదు.

కొన్ని నెలల తర్వాత ఆర్‌బీఐ దగ్గరున్న బంగారు నిల్వలను రెండు ఫారిన్ బ్యాంకుల దగ్గర తనఖా పెట్టింది గవర్నమెంటు. ఇదంతా రహస్యంగా చేసినా, 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'  జర్నలిస్ట్ దీనిని బయటపెట్టారు.

బంగారం తాకట్టు పెట్టినా ప్రభుత్వానికి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఆర్థిక సంక్షోభం పెరుగుతూనే ఉంది. అటువంటి పరిస్థితిలోనే గల్ఫ్ యుద్ధం ఒకటొచ్చింది. దీంతో దేశానికి రెండు రకాల సమస్యలు వచ్చాయి. మొదటిది దౌత్యపరంగా ఇరాక్, అమెరికాలలో ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకోవాల్సి రావడం క్లిష్టమైంది.

యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేయడం రెండో సమస్య అయింది.

యుద్ధానికి ముందు ప్రతి నెలా చమురు దిగుమతుల కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసేది మన దేశం. కానీ యుద్ధం ప్రారంభమైన తరువాత ఈ ఖర్చు నెలకు రూ. 1200 కోట్లకు చేరింది.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి చంద్రశేఖర్ గవర్నమెంటు అంతర్జాతీయ ద్రవ్య నిధిని సంప్రదించవలసి వచ్చింది. గల్ఫ్ యుద్ధంలో పాల్గొనే విమానాలకు ఇంధనం నింపడానికి విమానాశ్రయాలను ఉపయోగించడానికి అమెరికాకు అనుమతి అవసరం. దానికి సుబ్రమణియన్ స్వామి అంగీకరించారు.

సుబ్రమణ్య స్వామి, చంద్రశేఖర్ కారణంగా తక్కువ కాలంలోనే భారత్‌కు రుణం లభించింది. భారత్‌కు అప్పు ఇచ్చేందుకు అప్పట్లో IMF తప్ప ఎవరూ సిద్ధంగా లేరు.

అంతర్జాతీయ ద్రవ్య నిధి 25 షరతులు విధించింది. ఇందులో దేశ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ ఎకానమీగా మార్చడం ఒకటి.

1991 మే లో ఎన్నికలు జరిగాయి. రాజీవ్ గాంధీ టికెట్ ఇవ్వకపోవడంతో పీవీ నరసింహారావు రాజకీయాల నుంచి దాదాపు రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ జరిగింది మరోటి. రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారు. చంద్రశేఖర్ ఫైనాన్షియల్ అడ్జ్వైజర్  గా  ఉన్న మన్మోహన్ సింగ్‌  ఆర్థిక మంత్రి అయ్యారు. దీంతో ఆర్థిక రిఫార్మ్లకు బీజం పడింది.

click me!