మన ఊళ్లో కరువు పని చ్చిందంటే.. అది మన మన్మోహనుడి చలవే

By Modern Tales - Asianet News Telugu  |  First Published Dec 26, 2024, 11:08 PM IST

భారతదేశ మాజీ ప్రధానమంత్రి , ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్, ప్రణాళిక సంఘం, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI), ఆర్థిక సలహాదారు వంటి అనేక కీలక పదవుల్లో పనిచేసి భారత అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన డిసెంబరు 26, 2024లో మరణించారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కి సంబంధించిన 19 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు చూద్దాం.


  1. జననం: మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) జన్మించారు. భారత విభజన తరువాత, తన కుటుంబంతో కలసి భారత్‌కు వలస వచ్చారు.
  2. తల్లి మరణం: చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయిన సింగ్, తన అమ్మమ్మ చేతనే పెరిగారు.
  3. గ్రామ జీవనం: ఆయన పుట్టిన గ్రామంలో విద్యుత్ కూడా లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుంటుండేవారు.
  4. విద్య: సింగ్ అమృతసర్‌లోని హిందూ కళాశాలలో చదివి, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను పూర్తిచేశారు.
  5. ఉన్నత విద్య: ఆయన కెంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ట్రిపాస్ పూర్తి చేసి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డి.ఫిల్ సాధించారు.
  6. UNCTAD: 1966 నుండి 1969 వరకు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సులో (UNCTAD) పనిచేశారు.
  7. వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారు: లలిత్ నారాయణ మిశ్రా చేత నియమించబడి వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా పనిచేశారు.
  8. ఆర్థిక మంత్రిత్వ శాఖ: 1972లో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు.
  9. RBI గవర్నర్: 1982లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమించబడ్డారు.
  10. ప్రణాళిక సంఘం: 1985 నుండి 1987 వరకు ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేశారు.
  11. UGC ఛైర్మన్: 1991లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్‌గా నియమించబడ్డారు.
  12. ఆర్థిక మంత్రి: 1991లో పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, భారత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు.
  13. రాజ్యసభ: 1991లో రాజ్యసభకు ఎన్నికై, 1995, 2001, 2007,  2013లో తిరిగి ఎన్నికయ్యారు.
  14. ప్రధానమంత్రి: 2004 మే 22న మన్మోహన్ సింగ్ భారత్‌కు 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే జాతీయ ఉపాధి హామీ అదేనండీ 100 రోజుల పని పథకం ప్రారంభించారు.
  15. 1987లో పద్మ విభూషణ అవార్డు.
  16. 1993లో "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్" గా Euromoney  Asiamoney గుర్తింపు.
  17. 2002లో "ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు".
  18. 2005లో Time పత్రిక "ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా" ఆయనను గుర్తించింది.
  19. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి, తాను ఒక నిపుణుడిగా, మార్గదర్శిగా చరిత్రలో నిలిచారు.
click me!