మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. స్కూల్ వెలుపలు మహిళను కాల్చిచంపిన దుండగులు..

Published : Jul 06, 2023, 03:13 PM IST
మణిపూర్‌లో కొనసాగుతున్న హింస..  స్కూల్ వెలుపలు మహిళను కాల్చిచంపిన దుండగులు..

సారాంశం

మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ పాఠశాల వెలుపల మహిళను దుండగులు కాల్చి చంపారు.

మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణకు తెరపడం లేదు. తాజాగా ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ పాఠశాల వెలుపల మహిళను దుండగులు కాల్చి చంపారు. మణిపూర్‌లో పాఠశాలలు తిరిగి తెరిచిన ఒక రోజులోనే ఇలా జరగడం భయాందోళనలను కలిగిస్తోంది. కాల్పుల్లో మరణించిన మహిళకు సంబంధించిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ సంఘటన శిశు నిష్ఠా నికేతన్ పాఠశాల వెలుపల జరిగినట్టుగా సమాచారం. 

మాపావో, అవాంగ్ సెక్మాయ్ ప్రాంతాలకు చెందిన రెండు సాయుధ గ్రూపుల మధ్య కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఘర్షణను భద్రతా బలగాలు భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది. 

మరోక ఘటనలో.. తౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు(ఐఆర్బీ) చెందిన ఓ జవాన్ ఇంటిని అల్లరిమూకలు దహనం చేశాయి. పోలీసు ఆయుధాల నుంచి తుపాకీలను దోచుకోకుండా అల్లర్లను నిరోధించడంలో అతని విజయవంతమైన పాత్ర పోషించడంతో అల్లరిమూకలు ఈ చర్యకు పాల్పడ్డాయి. ఈ ఘోరమైన ఘర్షణలో గాయపడిన రొనాల్డో అనే 27 ఏళ్ల వ్యక్తి  మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఇంఫాల్‌లోని ఆసుపత్రికి తరలించే మార్గంలో మరణించాడు. ఇక, ఈ ఘర్షణలో మరో 10 మంది గాయపడ్డారు. వారు ఇంఫాల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటనల దృష్ట్యా మణిపూర్ ప్రభుత్వం జూలై 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల నిలిపివేతను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇక, షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు పోటీగా ‘‘గిరిజన సంఘీభావ యాత్ర’’ నిర్వహించబడిన తర్వాత మణిపూర్‌లో గందరగోళమైన పరిస్థితులు తలెత్తాయి. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం