
అమర్‌నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గడిచిన 5 రోజుల్లో దాదాపు 70 వేల మంది యాత్రికులు అమర్‌నాథ స్వామిని దర్శించుకున్నారు. 62 రోజుల పాటు సాగే ఈ యాత్ర జూలై 1న ప్రారంభమై.. ఆగస్ట్ 31న ముగుస్తుంది. బుధవారం రికార్డు స్థాయిలో 12,483 మంది పురుషులు.. 5,146 మంది మహిళలు.. 457 మంది పిల్లలు... 266 మంది సాధువులు, ఇద్దరు సాధ్విలు సహా 18,354 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది యాత్రికులు వచ్చే అవకాశం వుంది.
భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు, పౌర విభాగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్యాంప్ డైరెక్టర్ల పర్యవేక్షణలో ఆహారం, ఆరోగ్య సౌకర్యాలను అందిస్తున్నారు. పోలీస్, ఎస్‌డీఆర్ఎఫ్, పారా మిలిటరీ, ఆరోగ్య, పీడీడీ, పీహెచ్ఈ, యూఎల్‌బీ , ఐటీ, లేబర్, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్, పశుసంవర్ధక శాఖతో పాటు అన్ని విభాగాలు అమర్‌నాథ్ యాత్రకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి.
Also Read: అమర్‌నాథ్ యాత్ర-2023: రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు సహా పూర్తి వివరాలు మీ కోసం ..
కాగా.. అమర్‌నాథ్ ఆలయం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఒక హిందూ పుణ్యక్షేత్రం. 62 రోజుల పాటు సాగే అమర్‌నాథ్ యాత్ర జూలై 1, 2023న ప్రారంభమై ఆగస్టు 31న ముగుస్తుంది. అమర్‌నాథ్ యాత్ర 2023 అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్‌కు రెండు మార్గాల్లో యాత్ర ఏకకాలంలో ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాలకు ఏకకాలంలో ప్రారంభమవుతుంది- అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ట్రాక్, గందర్‌బల్ జిల్లాలోని బల్తాల్ ప్రాంతాల నుంచి ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌ల ద్వారా సోమవారం (ఏప్రిల్ 17) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడ్డాయి.