త్రిపుర ముఖ్య‌మంత్రిగా మాణిక్ స‌హా ప్ర‌మాణ‌స్వీకారం... హాజ‌రుకానున్న ప్ర‌ధాని మోడీ

Published : Mar 08, 2023, 10:19 AM ISTUpdated : Mar 08, 2023, 10:24 AM IST
త్రిపుర ముఖ్య‌మంత్రిగా మాణిక్ స‌హా ప్ర‌మాణ‌స్వీకారం... హాజ‌రుకానున్న ప్ర‌ధాని మోడీ

సారాంశం

Agartala: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని న‌రేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.  

Tripura CM Manik Saha: త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. అగర్తలాలోని వివేకానంద మైదానంలో జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రధాని మోడీ ఉదయం 10.45 గంటలకు అగర్తలాలోని సభాస్థలికి చేరుకుంటారు. డెంటల్ సర్జన్ అయిన మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. 2020లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమితులై 2022 మార్చిలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.

గత ఏడాది రాష్ట్ర పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించే వ‌ర‌కు ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. 2022లో ఈశాన్య రాష్ట్రంలో బహుముఖ పోటీ నెలకొనడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు బిప్లబ్ కుమార్ దేవ్ స్థానంలో సాహా బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఆయన గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యను కలిసి త్రిపురలో ప్రభుత్వ ఏర్పాటుకు గురించి చ‌ర్చించారు. అంతకుముందు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరి సర్వసభ్య సమావేశంలో మాణిక్ సాహాను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ప్రతిపాదించారు.

వివేకానంద మైదానంలో మాణిక్ సాహా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారని బీజేపీ త్రిపుర శాఖ ప్రధాన అధికార ప్రతినిధి సుబ్రతా చక్రవర్తి తెలిపారు. గత మూడు దశాబ్దాల్లో ఈశాన్య రాష్ట్రంలో వామపక్ష వ్యతిరేక ప్రభుత్వం అధికారాన్ని నిలుపుకోవడం ఇదే తొలిసారి. బీజేపీ 2.0 ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నామ‌ని చక్రవర్తి పేర్కొన్నారు. 

1988లో కాంగ్రెస్-టీయూజేఎస్ సరిహద్దు రాష్ట్రంలో వామపక్షాలను ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా 1993లో కమ్యూనిస్టుల చేతిలో ఓడిపోయింది. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. త్రిపురలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకోగా, దాని మిత్రపక్షం ఐపీఎఫ్టీ (ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర) ఒక స్థానాన్ని గెలుచుకోగలిగింది.

బీజేపీ, ఐపీఎఫ్టీ సంయుక్త శాసనసభాపక్ష సమావేశంలో నేతగా ఎన్నికైన రెండు గంటల తర్వాత మార్చి 6న అగర్తలాలో గవర్నర్ ను మాణిక్ సాహా కలిశారు. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. ఇదిలావుండగా, ఎన్నికల అనంతర హింస కారణంగా త్రిపుర కాంగ్రెస్, వామపక్షాలు ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాలని నిర్ణయించాయి. త్రిపురలో ఎన్నికల అనంతర హింసలో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు శనివారం తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలకు సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్ల‌డించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?