
Assam Earthquake: అసోంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో బుధవారం తెల్లవారుజామున కామరూప్ జిల్లాలో 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ప్రకారం, కామరూప్ జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో బుధవారం తెల్లవారుజామున 3:59 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.
భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం ఇంకా అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 28న గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.21 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) ధ్రువీకరించింది.