కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. అలాంటి కోవకే చెందిన ఓ వ్యక్తి మొసలి వేషం వేసుకొని, నిజమైన మొసలిని ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. పది సెకన్ల ఈ వీడియోను నరేంద్ర సింగ్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం వినోదం కోసం చాలా మంది ఫన్నీ వీడియోలపై దృష్టి పెడతారు. అలాంటి వీడియోలు నెట్టింట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. నిజంగా ఆ వీడియోలను చూస్తుంటే.. అసలు సమయం మనకు తెలియకుండా గడిచిపోతుంది. అలాంటి వీడియోలకు చాలా క్రేజ్ ఉంటుంది. చాలా వీడియోలను క్రియేట్ చేసి డబ్బులు సంపాదించే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ప్రపంచంలో తమని తాము చూపించుకుని.. వైరల్ కావాలని కొందరూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొందరూ తన జీవితాలను జీవితాలను పణంగా పెడతారు. అలాంటి వీడియోలను చూసి నవ్వు కోవాలో.. ఇదేం నిర్లక్ష్యం రా బాబూ అని కోపం వ్యక్తం చేయలేని పరిస్థితి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఈ వీడియో ఏంటో తెలుసుకుందాం..
ఓ వ్యక్తి మొసలి లాగా వేషం ధరించి.. నిజమైన మొసలిని ఆటపట్టిస్తున్నాడు. ఈ వీడియో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ చిన్న క్లిప్‌ను నరేంద్ర సింగ్ అనే వినియోగదారు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రమాదకరంగా మొసలి దగ్గరకు ఓ వ్యక్తి వెళ్లి.. పదే పదే దానిని ఆటపట్టించడం. ఇందుకోసం ఆ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టడం ఇందులో చూడవచ్చు. వీడియో క్యాప్షన్‌లో "కౌన్సా నషా కియా హై" అని ఉంది.ఈ వీడియోకు వందల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వచ్చాయి. ఒక వ్యక్తి మొసలిలా ఎలా ప్రవర్తిస్తాడో ఈ వీడియో చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 10 సెకన్ల ఫుటేజీలో.. చిరిగిన మొసలి వేషధారణలో ఒక వ్యక్తి నది ఒడ్డున పడుకున్నట్లు కనిపించాడు. మొసలి వేషంలో ఉన్న వ్యక్తి మొసలి శరీర భాగాన్ని పదేపదే లాగుతున్నాడు.
कौन सा नशा किए थे... pic.twitter.com/VHTMF56ope
— Narendra Singh (@NarendraNeer007)
పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసి.. చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు. ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు.. ఇది ధైర్యమా..?మూర్ఖత్వామా..? అని ప్రశ్నించాడు. మరొకరు చనిపోవడానికి ఇది సృజనాత్మక మార్గం అని అన్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించారు. వైరల్ అవుతున్న ఈ వీడియో జనాలను విపరీతంగా భయపెడుతోంది. కాస్త అజాగ్రత్తంగా ఉంటే..ప్రాణాలు పోయే పరిస్థితి అంటున్నారు. ఆ వ్యక్తి చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.