పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన.. ఉమ్ముతో నాన్ తయారీ.. వీడియో వైరల్‌గా మారడంతో..

Published : Apr 23, 2022, 09:44 AM IST
పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన.. ఉమ్ముతో నాన్ తయారీ.. వీడియో వైరల్‌గా మారడంతో..

సారాంశం

ఓ పెళ్లి వేడుకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అతిథులకు వంటలు సిద్దం చేస్తున్న వ్యక్తి లాలాజలంతో నాన్‌ తయారుచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా  మారింది. 

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లాలో మోదీనగర్‌లో ఓ వ్యక్తి నీచమైన పనికి పాల్పడ్డాడు. లాలాజలంతో నాన్‌ తయారుచేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా  మారింది. అయితే ఇది ఓ పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. వివరాలు.. ఓ వ్యక్తి తన లాలాజలంతో నాన్స్ తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఆ ఘటన గోవింద్‌ పురి కాలనీలో జరిగిన ఓ వివాహ వేడుక సమయంలో చోటుచేసుకుందని గుర్తించారు. 

ఆ వీడియోలో నాన్స్ చేస్తున్న వ్యక్తి దానిని కాల్చడానికి ముందు ఉమ్మును ఉంచుతున్నాడు. దీనిని గమనించిన ఎవరో ఆ దృశ్యాలను రికార్డు చేసి.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితునిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. 

ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఘజియా‌బాద్ పోలీసు ఉన్నతాధికారులు.. విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని మోదీనగర్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ ఆదేశించినట్టుగా తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం