
సమాజంలో వివాహేత సంబంధాలు ఎన్నో ఘటనకు దారి తీస్తున్నాయి. చక్కగా సాగిపోతున్న కాపురంలో ఇవి చిచ్చుపెడుతున్నాయి. వీటి వల్ల కొన్ని సార్లు దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. భార్యాభర్తలు విడిపోవడమో లేక ఒకే ఇంట్లో ఉన్నా వారు సఖ్యతతో మెలగకపోవడమో జరుగుతున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో అయితే ఆత్మహత్యకో లేకపోతే హత్యలకో దారి తీస్తున్నాయి. తాజాగా బీహార్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ మహిళకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంత కాలంగా పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇప్పటిలాగే వారు బెడ్ రూమ్ లో రొమాన్స్ చేసుకుంటుండగా.. ఆ రోజు ఒక్క సారిగా భర్త ఇంటికి వచ్చాడు. వారిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీంతో భర్తను ఇద్దరూ కలిసి హతమార్చారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల ఇలా ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోని పుర్నియ జిల్లాలో చకర్పద అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పోషిత్ కుమార్ అనే వ్యక్తికి సావిత్రిదేవి అనే మహిళతో పది సంవత్సాల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితంలోకి పక్కింటి వ్యక్తి అరవింద్ మహల్దార్ ప్రవేశించాడు. అతడితో సావిత్రిదేవి వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
కొంత కాలం పాటు వీరి వ్యవహారం కొనసాగుతూనే ఉంది. అయితే ఒక రోజు భర్త పోషిత్ కుమార్ బయట పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఆ సమయానికే భార్య, పక్కింటి వ్యక్తి రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు. వారిద్దరు అతడికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. దీంతో వారి మధ్య తీవ్రంగా గొడవ చోటు చేసుకుంది. విషయం కుమార్ కు తెలిసిపోయింది కాబట్టి అతడు బయట చెబితే సమస్యలు వచ్చే అవకాశం ఉందని అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి పోషిత్ కుమార ను దారుణంగా హత్య చేశారు. అతడి మెడకు తాడు చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసి చనిపోయేలా చేశారు.
పోషిత్ కుమార్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.