
ముంబై : మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ Navneet Kaur Ranaపై ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమెతో పాటు ఆమె భర్త ఎమ్మెల్యే Ravi Ranaలకు కూడా నోటీసులు అందించారు. సీఎం Uddhav Thackeray నివాసం మాతోశ్రీ బయట Hanuman Chalisa పఠిస్తామని ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు ఇలా స్పందించారు.
శుక్రవారం ఉదయం ముంబై నగరం చేరుకున్న రానా దంపతులు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యారు. వాళ్ళ సవాల్ నేపథ్యంలో.. ముంబైకి శివసేన కార్యకర్తలు, ప్రత్యేకించి మాతోశ్రీ దగ్గర గుమిగూడారు. ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం కింద వాళ్లకు నోటీసులు జారీ చేశారు. జోన్ 9 డిసిపి మంజునాథ్ షింగే. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే.. దానికి ఈ భార్యాభర్తలే బాధ్యత వహించాలని పోలీసులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఇదిలా ఉంటే, హనుమాన్ చాలీసా పఠించాలంటూ సీఎం ఉద్దవ్ థాక్రేకు సవాల్ విసిరాడు మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానా.. అది జరగని పక్షంలో తాను, తన భార్య నవనీత్ కౌర్.. అనుచరగణంతో పాటు మాతోశ్రీ బయట హనుమాన్ చాలీసా పఠిస్తామని పేర్కొన్నారు. దీంతో ఈ జంటను శివ సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో రైలు మార్గం గుండా ముంబైకి చేరుకోవాలనుకున్న జంట.. విమానంలో వచ్చింది. ఆపై నందగిరి గెస్ట్ కు చేరుకోగా.. అక్కడికి చేరుకున్న శివ సైనికులు హనుమాన్ చాలీసాతో హోరెత్తించారు.
ఈ వ్యవహారంలో రానా దంపతులు వెనక్కి తగ్గారా? లేదా? అన్న దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. సుమారు 65 వందలమంది అనుచరులతో వాళ్లు ముంబైకి చేరుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ముంబై పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న ముంబైలోని శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) నాయకులు ఓ ట్యాక్సీలో లౌడ్ స్పీకర్లు అమర్చి హనుమాన్ చాలీసా వినిపించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హనుమాన్ చాలీసాను నిలిపివేసి, ఎంఎన్‌ఎస్ నాయకుడు యశ్వంత్ కిల్లెదార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. రామ నవమి సందర్భంగా మహారాష్ట్ర రాజధానిలోని శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం బయట లౌడ్ స్పీకర్‌లో హనుమాన్ చాలీసా ప్లే చేయాలని MNS గతంలో ప్రకటించింది. ఈ ప్రకటన నేపథ్యంలో ఆదివారం ఆ పార్టీ నాయకులు నేడు ఈ చర్యకు పూనుకున్నారు.
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే గత వారం ముంబైలో గుడి పడ్వా ర్యాలీ సందర్భంగా ఓ వివాదాస్పద ప్రకటన చేశారు. మసీదుల్లో వినియోగించే లౌడ్ స్పీకర్లను మూసివేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఆయన కోరారు. లేకపోతే ఆ మసీదుల ఎదుట లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించారు. “ మసీదులలో లౌడ్ స్పీకర్లను ఎందుకు అంత పెద్ద శబ్దంతో ప్లే చేస్తారు ? దీనిని ఆపకపోతే మసీదుల వెలుపల ఎక్కువ శబ్దంతో హనుమాన్ చాలీసా ప్లే చేస్తాం. ” అని ఏప్రిల్ 2 న శివాజీ పార్క్ వద్ద జరిగిన ర్యాలీలో ఠాక్రే అన్నారు.