
ఉత్తరప్రదేశ్ : uttarpradesh, బిజ్నోర్‌లోని ఒక పొలంలో జులై 19న ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. ఆ మహిళను హత్య చేసిన ఆమె బావను పోలీసులు అరెస్టు చేశారు. జులై 19న యుపిలోని బిజ్నోర్‌లోని పొలంలో లభ్యమైన ఒక మహిళ మృతదేహం కలకలం రేపింది. ఆమెను ఆమె సొంత బావే హత్య చేసినట్లు తేలింది. జులై 19న పశుగ్రాసం సేకరించేందుకు ఆ మహిళ పొలాల్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె బావ, అతని ముగ్గురు స్నేహితులు ఆమెను దారుణంగా చంపారు. మృతురాలిని కుంకుమ్‌గా గుర్తించారు.
ప్రధాన నిందితుడు విశాల్‌కు, కుంకుమ్‌కు ఏడాది కాలంగా అక్రమ సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. కుంకుమ్ భర్త ఉద్యోగం కారణంగా హరిద్వార్‌లో నివసిస్తున్నాడు. అయితే, ఇలా కొన్ని నెలలు గడిచిన తరువాత కుంకుమ్ ఎఫైర్ కొనసాగించడానికి నిరాకరించింది. విశాల్‌ను కలవడం మానేసింది. విశాల్ తన మరదలు తిరస్కరణను భరించలేకపోయాడు. ఆమెను ఎలాగైనా మళ్లీ లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. దీంతో తమ వ్యవహారం గురించి తన స్నేహితులకు చెప్పాడు.
తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఆందోళన కలిగిస్తున్న వరుస మరణాలు..
అతని స్నేహితులు విశాల్‌తో తమ సంబంధాన్ని కొనసాగించడానికి ఆమెను ఒప్పించేందుకు ప్లాన్ వేశారు. మరుసటి రోజు ఉదయం, నలుగురు వ్యక్తులు పొలాల్లోకి వెడుతున్న కుంకుమ్‌ను అనుసరించారు. ఆమె మీద అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే బాధితురాలు సహాయం కోసం కేకలు వేయడంతో ఆమె గొంతుకోసి హత్య చేశారు. నిందితులందరిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఫిర్యాదు చేశారు.