నా మీసాలు నా ఇష్టం.. ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న మహిళ...!

By telugu news teamFirst Published Jul 27, 2022, 10:27 AM IST
Highlights

నిజానికి హార్మోన్ల లో లోపం కారణంగా అలా పురుషల మాదిరిగా స్త్రీలలోనూ ముఖంపై వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇది చాలా సర్వ సాధారణ విషయం. కానీ.. ఇప్పుడు అందరూ అందం కోసం పరితపిస్తున్నారు కాబట్టి... వాటిని తొలగించుకుంటున్నారు.

మనుషుల శరీరాలపై వెంట్రుకలు రావడం సహజం. పురుషులు తమ శరీరంపై వెంట్రుకలు ఉండటాన్ని చాలా గొప్పగా ఫీలౌతారు. కానీ.. స్త్రీలు అలా కాదు. తమ శీరరంపై వెంట్రుకలు ఉండటాన్ని ఇష్టపడరు. ముఖ్యంగా.. ముఖంపై అస్సలు భరించలేరు. వెంటనే పార్లర్ కి వెళ్లి.. డబ్బులు ఖర్చు చేసి మరీ వాటిని తొలగించుకుంటారు. ఇక పెదాలపై వెంట్రుకలు అంటే మీసం లాగా ఉంటే.. వాటిని అస్సలు ఉంచుకోరు. కొందరు నెల నెలా వాటిని తొలగించుకుంటే.. కొందరు ఏకంగా.. అసలు ఎప్పటికీ అవి రాకుండా ఉండేందుకు లేజర్ చికిత్స లు కూడా చేయించుకుంటారు. ఇవన్నీ మనకు తెలిసిందే. 

కానీ ఓ మహిళ మాత్రం.. తన ముఖంపై మీసాలు పెరిగినా.. నా మీసం నా ఇష్టం అంటూ గర్వంగా చెబుతోంది.  నిజానికి హార్మోన్ల లో లోపం కారణంగా అలా పురుషల మాదిరిగా స్త్రీలలోనూ ముఖంపై వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇది చాలా సర్వ సాధారణ విషయం. కానీ.. ఇప్పుడు అందరూ అందం కోసం పరితపిస్తున్నారు కాబట్టి... వాటిని తొలగించుకుంటున్నారు.

అయితే.. కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన షైజా(35) ఏళ్ల మహిళ మాత్రం.. తన ముఖంపై మీసాలను అమితంగా ప్రేమిస్తోంది. ఆమెకు తన మీసాలు బాగా నచ్చాయట. అసలు మీసాలు లేకుండా ఆమె తన ముఖాన్ని చూసుకోలేరట.తనకు తన మీసాలు అంటే చాలా ఇష్టమని చెబుతోంది. అయితే.. కనుబొమ్మలను మాత్రం తరచూ థ్రెడ్డింగ్ చేసుకుంటుందట. కానీ... మీసాలను మాత్రం తొలగించుకోదట.

కరోనా సమయంలో అందరూ మూతికి మాస్క్ లు ధరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సమయంలోనూ ఆమె మాస్క్ కూడా ధరించడానికి ఇష్టపడలేదట. చాలా మంది ఆమెకు ఆ మీసాలను తొలగించమని సలహా ఇచ్చారట. అయితే.. ఆమె మాత్రం ఎంత మంది చెప్పినా.. వాటిని తొలగించడానికి ఇష్టపడలేదని ఆమె మీడియాకు చెప్పింది.

కాగా.. ఆమెకు మీసం విషయంలో.. తల్లిదండ్రులు , కుటుంబసభ్యులు కూడా మద్దతుగా ఇవ్వడం విశేషం. తమ కుమార్తె... మీసంతోనే అందంగా ఉంటుందని ఆమె తల్లిదండ్రులు కూడా చెప్పడం గమనార్హం.

click me!