
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో దారుణ ఘటన వెలుగు చూసింది. డ్రగ్స్, మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను రాయితో కొట్టి చంపాడు. దేవేంద్ర విశ్వకర్మ అనే నేరస్థుడు డ్రగ్స్, మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచుగా చిన్న చిన్న విషయాలపై భార్యతో గొడవపడేవాడు. శారీరక హింసించేవాడు.
దీంతో ఇంట్లో భయానక వాతావరణం సృష్టించేవాడు. కూరల్లో ఉప్పు తక్కువైందనో, చపాతీలు సరిపోలేదనో.. ఇలా చాలా చిన్న చిన్న విషయాలకు కూడా భార్య మీద విరుచుకుపడేవాడు. ఇదే క్రమంలో ఈ హత్యలు కూడా జరిగాయి. ఈ విషాద ఘటన జరిగిన సమయంలో దేవేంద్ర తండ్రి ఠాకుర్దీన్, తల్లి ఇంట్లో లేరు. దీంతో ఇంత దారుణం జరిగిపోయింది.
లాక్‌డౌన్ సమయంలో బోన్ ఆర్టిస్ట్‌గా మారిన కశ్మీరీ అజీజ్ ఉర్ రెహ్మాన్
ఆ రోజు రాత్రి ఏదో కారణంతో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన దేవేంద్ర తన కుటుంబాన్ని దారుణంగా హత్య చేశాడు. అతను తన భార్య రామ్ కుమారి, ఇద్దరు కుమార్తెలు, 9 ఏళ్ల ఆరుషి, 5 ఏళ్ల సోనాక్షిలను రాళ్లతో చితకబాదాడు. దీంతో తీవ్రగాయాలపాలై వీరు ముగ్గురూ మృతి చెందారు.
వారిమీద దాడి చేసిన తరువాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేకలు, అరుపులతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి భార్య, కూతుళ్ల మృతదేహాలు కనిపించాయి. ఈ దారుణ దృశ్యాన్ని చూసిన ఓ బంధువు వెంటనే ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ట్రిపుల్ మర్డర్ వార్త ఆ ప్రాంతమంతా భయాందోళనలు కలిగించింది.
పోలీసు సూపరింటెండెంట్ అపూర్ణ గుప్తా, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సత్యంతో సహా ఇతర అధికారులు, పోలీసు అధికారులు నేరస్థలాన్ని సందర్శించడానికి ప్రేరేపించారు. ఫోరెన్సిక్ బృందాన్ని కూడా రప్పించి సాక్ష్యాలను సేకరించి సమగ్ర విచారణ జరిపారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.