ప్రధానిపై పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు - మల్లికార్జున్ ఖర్గే సంచలన ప్రకటన

Published : Jul 18, 2023, 02:10 PM ISTUpdated : Jul 18, 2023, 02:37 PM IST
ప్రధానిపై పదవిపై కాంగ్రెస్ కు ఆసక్తి లేదు - మల్లికార్జున్ ఖర్గే సంచలన ప్రకటన

సారాంశం

కాంగ్రెస్ పార్టీకి ప్రధాని పదవి అంటే ఇంట్రెస్ట్ లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బెంగళూరులో నేడు ప్రతిపక్ష సమావేశాలన్నీ సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రధాని పదవిపై కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ప్రకటన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి 26 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో కీలక సమావేశం నిర్వహిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

వార్నీ.. ప్రియురాలిని చీకట్లో కలిసేందుకు ఊరు మొత్తానికే కరెంట్ కట్ చేసిన ప్రియుడు.. ఇద్దరూ సన్నిహితంగా ఉండగా..

‘‘ఎంకే స్టాలిన్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కు అధికారం, ప్రధాని పదవిపై ఆసక్తి లేదని నేను చెన్నైలో చెప్పాను. ఈ సమావేశం ఉద్దేశం మనం అధికారం సంపాదించడం కాదు. ఇది మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడానికి’’ అని ఖర్గే చెప్పారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ పేర్కొంది.

‘‘రాష్ట్రస్థాయిలో కొందరి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు సైద్ధాంతికమైనవి కావు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజల కోసం, యువత, పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల కంటే ఈ విభేదాలేమీ పెద్దవి కావు. ఎందుకంటే వారి హక్కులను తెరవెనుక నిశ్శబ్దంగా అణగదొక్కుతున్నారు’’ అని ఆయన ఆరోపించారు.

‘యోగి, మోడీ ప్రభుత్వాలే టార్గెట్.. ముంబైలో 26/11 తరహా మరో దాడి’- పోలీసులకు అగంతకుడి బెదిరింపు కాల్

ఇదిలా ఉండగా.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు మూడు వారాల క్రితం ప్రతిపక్షాలన్నీ కలిసి మూడు వారాల కింద బీహార్ లోని పాట్నాలో సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశం అనంతరం మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమం ఎజెండాను పెంపొందించడానికి భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తాయని అన్నారు.‘‘ ద్వేషం, విభజన, ఆర్థిక అసమానతలు, దోపిడీ వంటి నిరంకుశ, ప్రజావ్యతిరేక రాజకీయాల నుంచి భారత ప్రజలను విముక్తం చేయాలనుకుంటున్నాం. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ సూత్రాలకు లోబడి నడిచే భారతదేశాన్ని మనం కోరుకుంటున్నాం. బలహీనులకు ఆశ, విశ్వాసం కల్పించే భారత్ మాకు కావాలి. ఈ భారతదేశం కోసం ఐక్యంగా నిలబడతాం’’ అని పేర్కొన్నారు.

కొంప ముంచిన యూట్యూబ్ రెమెడీ.. పంటి నొప్పి తగ్గేందుకు వీడియోల్లో చెప్పినట్టు చేసి, మృతి చెందిన యువకుడు..

ఆ సమావేశానికి కొనసాగింపుగా నేడు మళ్లీ 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు బెంగళూరులో మేధోమథనం కోసం సమావేశమయ్యారు. అయితే ఇప్పుడు ప్రధాని పదవిపై తమకు ఇంట్రెస్ట్ లేదని కాంగ్రెస్ పేర్కొంది. మరి ప్రతిపక్షాలన్నీ కలిసి ఎవరిని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తాయో చూడాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

నేపాల్ వరద బాధితుల కోసం ఇతని సహాయానికి నెటిజన్లు ఫిదా Nepal Floods Young Volunteers Setup Help Point
నేపాల్ వరదల్లో గల్లంతైన ప్రాణ స్నేహితులు కన్నీరు పెట్టుకున్న విద్యార్ధి| Friends Missing Nepal Flood