
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. అప్పుగా తీసుకున్న రూ.3వేలు తిరిగి ఇవ్వాలంటూ ఓ 21యేళ్ళ యువకుడిని దారుణంగా హత్య చేశారు. 17సార్లు కత్తితో పొడిచి, పొడిచి చంపాడో వ్యక్తి. మృతుడు డెనిమ్ షాపులో కార్మికుడిగా పనిచేస్తున్న యూసుఫ్ అలీ.
దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌కు 100 మీటర్ల దూరంలో ఈ హత్య జరిగింది. నిందితుడు షారుఖ్ ఓ వీధిలో రక్తస్రావంతో పడి ఉన్న యూసుఫ్ అలీని పదే పదే కత్తితో పొడిచి చంపడాన్ని దారిన వెళ్లే వ్యక్తి ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. రెండు నిమిషాల ఈ వీడియోలో మొదట జనం చుట్టూ నిలబడి చోద్యం చూస్తున్నారు.
షాకింగ్.. టీ ఇవ్వడం ఆలస్యమైందని భార్య గొంతుకోసి చంపిన భర్త...
బాధితుడైన యూసుఫ్, తనను తాను రక్షించుకునే చివరి ప్రయత్నంలో, షారుక్ మెడను తన కాళ్లతో పట్టుకున్నాడు, కానీ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు షారుక్‌ను కొట్టి గాయపరిచారు. బట్టల షాపులు వరుసగా ఉన్న లేన్ బయటే హత్య జరిగింది. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు అందరూ షాక్ తో బిగుసుకుపోయారు. కాసేపటి తరువాత కొంతమంది బాటసారులు ధైర్యం చేసి, ఒక కర్రతో షారూఖ్ చేతితో కొట్టారు, దీంతో అతని చేతిలోని కత్తిని కింద పడింది. ఒక వ్యక్తి యూసుఫ్‌ను విడిచిపెట్టమంటూ షారుక్‌ను కొట్టడం, తన్నడం వీడియోలో కనిపిస్తుంది.
ఆ తరువాత యూసుఫ్, షారుక్ ఇద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ యూసుఫ్ చనిపోయినట్లు ప్రకటించారు. షారుఖ్ చికిత్స పొందుతున్నాడు. పోలీసులు షారూక్ ను అరెస్ట్ చేశారు. దాడి గురించి పోలీసులకు ఉదయం 7.15 గంటలకు పిసిఆర్ కాల్ వచ్చింది.
గత 3-4 రోజులుగా షారుక్ తన కొడుకును ఏదో డబ్బుల విషయంలో బెదిరిస్తున్నాడని యూసుఫ్ తండ్రి షాహిద్ పోలీసులకు తెలిపారు.
యూసుఫ్ నెలన్నర క్రితమే డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మొహర్రం సందర్భంగా షారుక్‌కి, అతనికీ గొడవ జరిగింది.
డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి మాట్లాడుతూ.. 'షారుక్ నుంచి తన కుమారుడు యూసుఫ్ రూ. 3వేలు అప్పుగా తీసుకున్నాడని, అతను అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేకపోయాడని యూసుఫ్ తండ్రి తెలిపాడు. షారూఖ్ అతడిని చంపేశాడు. పోలీసులు షాహిద్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. బాధితుడుని రక్షించడానికి ప్రయత్నించే క్రమంలో జనాలు కొట్టడంతో గాయాలపాలైన నిందితుడు కూడా ఆసుపత్రిలో చేరాడు" అని తెలిపారు.
షారుక్ స్కూల్ డ్రాపౌట్ అని అధికారి తెలిపారు. ‘షారూక్ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. అరెస్టు చేశాతం. అయితే ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. టిగ్రీ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు’ అని డిసిపి చౌదరి తెలిపారు.
షాహిద్ ఇంకా ఇలా చెప్పుకొచ్చాడు.. "నా కొడుకు తన చెల్లెను స్కూల్ కు దింపడానికి వెళ్ళాడు. తిరిగి వస్తుండగా అతనిపై దాడి చేశాడు. చాలాసార్లు కత్తితో పొడిచాడు. యూసుఫ్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దుకాణాల దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు, దీంతో వారి నుంచి తప్పించుకోగలిగాడు. మొదట్లో అతడిని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు.
అయితే... స్థానికులు షారూక్‌ను కర్రతో కొట్టి అడ్డుకునే సమయానికే, నా కొడుకు అప్పటికే కుప్పకూలిపోయాడు, నా కొడుకు రోడ్డుపై పడి ఉన్నాడని కొంతమంది నాకు చెప్పారు, నా మోకాలికి ఆపరేషన్ చేయడంతో, నేను వెంటనే వెళ్లలేకపోయాను’ అని చెప్పుకొచ్చాడు.