తలకు గన్నుపెట్టి బెదిరిస్తున్న టెర్రరిస్ట్ చెంప చెల్లుమనిపించాడు.. కానీ చివరికి అసలు విషయం తెలిసి...

Published : Aug 09, 2023, 02:11 PM IST
తలకు గన్నుపెట్టి బెదిరిస్తున్న టెర్రరిస్ట్ చెంప చెల్లుమనిపించాడు.. కానీ చివరికి అసలు విషయం తెలిసి...

సారాంశం

ఆలయంలోకి చొరబడి తుపాకులతో బెదిరిస్తూ.. భయాందోళనలు సృష్టిస్తున్న ఓ టెర్రరిస్ట్ చెంప పగలగొట్టాడో సామాన్యుడు. 

మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఎవరు ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది.  ఓ సామాన్యుడు ఉగ్రవాది చెంప చెల్లుమనిపించాడు. ప్రాణాలు లెక్క చేయకుండా టెర్రరిస్టుకు ఎదురు వెళ్ళాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను ప్రదర్శించిన ధైర్య సాహసాలను నెటిజెన్లు ప్రశంసలతో ముంచెత్తారు. ఆ తర్వాత అసలు ట్విస్టు తెలిసి నోరేళ్ళబెడుతున్నారు.

మహారాష్ట్రలోని ధూలేలో రద్దీగా ఉండే ఓ ప్రాంతంలోని దేవాలయంలోకి కొందరు దుండగులు దూసుకువచ్చారు. మొహాలు కనిపించకుండా మాస్కులు పెట్టుకున్నారు. రావడం రావడమే ఆలయం దగ్గర ఉన్న ఓ భక్తుడి తలకు గన్నుపెట్టారు. మిగతా వారిని బెదిరించడం మొదలుపెట్టారు. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

"కాశ్మీర్‌లో ముస్లిం పిల్లల సమాధానం విని ఆశ్చర్యపోయాను.." : బ్రిటిష్-అరబ్ ఇన్‌ఫ్లుయెన్సర్

తల్లులతో వచ్చిన పిల్లలయితే ఏడుపు మొహాలు పెట్టేశారు. ఇదంతా చూస్తున్న అక్కడే ఉన్న ఓ వ్యక్తి  ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే ముందుకు దూసుకెళ్లాడు. మరో భక్తుడి తలపై గనిపెట్టి బెదిరిస్తున్న దుండగుడిని.. మీకు అసలు బుద్ధుందా? అంటూ కేకలు వేయడం  ప్రారంభించాడు. వెంటనే  ఒక్కసారిగా ఆ ఉగ్రవాది చెంప చెల్లుమనిపించాడు.

ధూలేలోని శ్రీ స్వామినారాయణ ఆలయంలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చింది. వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికి కానీ పోలీసులు అసలు విషయం చెప్పలేదు. అది విన్న తర్వాత అక్కడున్న వారంతా ఒకసారిగా అవాక్కయ్యారు.

తుపాకీ శబ్దాలకు వణికిపోయిన భక్తులంతా అదంతా మాక్ డ్రిల్ లో భాగం అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. టెర్రరిస్టులపైకి అత్యంత సాహసోపేతంగా దూసుకు వెళ్లిన ఆ వ్యక్తి పేరు ప్రశాంత్ కూలకర్ణి అని తెలిపారు. టెర్రరిస్ట్ లను చూసి తన కూతురు ఏడవడంతో… కోపానికి వచ్చిన అతను అంత ధైర్యానికి తెగించాడని తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌