Viral Video: వీడి పిచ్చి తగలయ్యా... కదిలే ట్రక్కు మీద పుషప్స్..!

Published : Jul 18, 2022, 10:44 AM IST
Viral Video: వీడి పిచ్చి తగలయ్యా... కదిలే ట్రక్కు మీద పుషప్స్..!

సారాంశం

కనీసం ఒంటిపై చొక్కా కూడా లేకుండా.. కదిలే ట్రక్కు పై ఫీట్లు చేశాడు. ట్రక్కుపై నిలపడటమే కాకుండా..పుష్ అప్స్ కూడా చేశాడు. అతనో పెద్ద సూపర్ హీరోలాగా ఫోజులు ఇవ్వడం గమనార్హం.

పుర్రకో బుద్ది.. జిహ్వకో రుచి అని ఊరికే చెప్పలేదు పెద్దలు. కొంత మంది చేసే పనులు చూస్తూంటే.. ఇలాంటి సామేతలు నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఓ యువకుడు చేసిన పని చూస్తే.. వీడి పిచ్చి తగలెయ్యా.. కాస్త అటూ.. ఇటూ అయితే పరిస్థితి ఏంటి అనే భావన కలుగుతుంది. ఓ యువకుడు కదిలే ట్రక్కుపైన పుష్ అప్స్ చేశాడు. ఈ క్రమంలో.. కొద్దిగా అటూ, ఇటూ అయినా.. కింద పడి ప్రాణాలు పోయేవి. కాకపోతే.. అదృష్టవశాత్తు గాయాలతో బయటపడ్డాడు.  ప్రస్తుతం ఇతను పుష్ అప్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో  చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

లక్నోలో ఓ యువకుడు రాత్రిపూట.. కనీసం ఒంటిపై చొక్కా కూడా లేకుండా.. కదిలే ట్రక్కు పై ఫీట్లు చేశాడు. ట్రక్కుపై నిలపడటమే కాకుండా..పుష్ అప్స్ కూడా చేశాడు. అతనో పెద్ద సూపర్ హీరోలాగా ఫోజులు ఇవ్వడం గమనార్హం. దీనిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది. కొద్దిసేపు బాగానే ట్రక్కు మీద కంట్రోల్ చేసుకున్నాడు. ఆ తర్వాత కంట్రోల్ తప్పి.. కింద పడ్డాడు. ఫలితంగా గాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ వీడియోని ఓ పోలీసు అధికారి ట్విట్టర్ లో షేర్ చేసి.. శక్తి మాన్ కాదు.. బుద్దిమ్యాన్ లాగా ఉండాలి అంటూ షేర్ చేయడం గమనార్హం. అతను కింద పడటం చూస్తే.. మనకు కూడా వెన్నులో వణుకు పుడుతుంది.  తృటిలో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు కానీ.. ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ గాయాలు కూడా చాలా ఎక్కువగానే అయ్యాయని.. అవి తగ్గడానికి కూడా ఎక్కువ కాలమే పడుతుందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు