President Election: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

Published : Jul 18, 2022, 10:29 AM IST
President Election: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.  ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌తో పాటు,  రాష్ట్రాల్లోని  అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. 

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.  ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌తో పాటు,  రాష్ట్రాల్లోని  అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. పార్లమెంట్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు రాష్ట్రాల అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు.. అక్కడి శాసన సభ్యులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో  ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నెల 21న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఇప్పటివరకు పార్టీల మద్దతు సమీకరణాలను పరిశీలిస్తే.. ద్రౌపది ముర్ముకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక, రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభలు, అన్ని రాష్ట్రాల శాసనసభల సభ్యులు.. అలాగే ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు పింక్ బ్యాలెట్‌ పేపర్లను ఈసీ అందుబాటులో ఉంచింది. 

 

ఇక, రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయలేవు.  కాబట్టి ఓటింగ్కు అవకాశం ఉంటుంది.  జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ  లేనందున ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 నుంచి 700 తగ్గింది.  ఇక ఎమ్మెల్యేలు ఓటు విలువలో 208 తో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.  176 తో jharkhand,  తమిళనాడు రెండో స్థానంలో,  175 తో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉన్నాయి.  ఎమ్మెల్యేల ఓటు విలువ అతి తక్కువగా 7 గా ఉంది.

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?