బట్టలు విప్పేసుకుని మహిళ వెంటపడి.. కోరిక తీర్చాలంటూ.. మహారాష్ట్రలో కామాంధుడి వీరంగం..

By SumaBala BukkaFirst Published Dec 31, 2022, 12:03 PM IST
Highlights

ఆటో నడిపే ఓ మహిళ మీద ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బట్టలు విప్పేసుకుని, నగ్నంగా మారి కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు.
 

మహారాష్ట్ర : మహారాష్ట్రలోని పూణే లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఆటోరిక్షా కార్మికురాలిపై ఓ కామాంధుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెను వెంటాడి వేధించాడు. తన కోరిక తీర్చాలంటూ బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత  తన ఒంటి మీద బట్టలన్నీ విప్పేసుకుని.. ఆ మహిళ వెంటపడ్డాడు. ఆమె వెంట పరిగెత్తాడు. ఆమె మీద అత్యాచార ప్రయత్నం చేశాడు. నిఖిల్ అశోక్  మొమ్జాడే (30) అనే వ్యక్తి మహారాష్ట్ర పూణేలోని  శంకర్ మట్ హడప్సర్ ప్రాంతంలో ఉంటాడు. డిసెంబర్ 26 నాడు రాత్రి 8 గంటల సమయంలో నిఖిల్ ఓ రిక్షా ఎక్కాడు. ఆటోరిక్షాను ఓ మహిళ నడుపుతోంది.  ఆ మహిళ (38)  పూణేలో ఉంటుంది. ఆటో నడపడం ద్వారా జీవనోపాధి పొందుతోంది. 

ఆమె ఆటోలో ఎక్కిన నిఖిల్ కత్రాజ్ ఘాట్ కు వెళ్లాలని మహిళతో చెప్పాడు. ఆమె అటువైపుగా ఆటోను తీసుకువెళుతుంది. అలా కొద్ది దూరం ప్రయాణించారు. ఆ తర్వాత కాసేపటికి రిక్షాను ఆపాలని  చెప్పాడు. అప్పటికి రాత్రి పది గంటలు అయింది. చుట్టూ చీకటి.. కనుచూపు మేరలో ఎవరూ కనిపించడం లేదు. ఇదే అదనుగా భావించిన నిఖిల్ రిక్షా నడుపుతున్న ఆ మహిళపై  అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలని బలవంత పెట్టాడు. దీనికి ఆ మహిళా షాక్ అయింది. నిఖిల్ కోరికను ఒప్పుకోలేదు. 

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: జ‌న‌వ‌రి 5న బీజేపీ రాష్ట్రవ్యాప్త ర‌థ‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న అమిత్ షా

దీంతో కోపానికి వచ్చిన నిఖిల్ ఆమెను కొట్టాడు. అంతటితో ఆగకుండా తన దుస్తులన్నీ విప్పేసుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా భయపడిన మహిళా రిక్షాను వదిలేసి పరుగు మొదలు పెట్టింది. అయినా నిఖిల్ ఆమెను వదిలి పెట్టలేదు. అలాగే నగ్నంగా ఆమె వెంట పడుతూ కోరిక తీర్చాలంటూ  పరిగెత్తాడు. ఎలాగో అతడి నుంచి తప్పించుకున్న అధ్యక్ష కార్మికురాలు.. నేరుగా మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అక్కడ ఈ విషయం మీద ఫిర్యాదు చేసింది.

click me!