టైగర్ కిషన్ ఇక లేదు. క్యాన్సర్ తో పోరాడి నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ పార్క్ లో మృతి

By team teluguFirst Published Dec 31, 2022, 11:45 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ పార్క్‌లో అధికారుల సంరక్షణలో ఉన్న టైగర్ కిషన్ చనిపోయింది. ఈ పులి 13 సంవత్సరాలుగా క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు అధికారులు తెలిపారు. 

గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న టైగర్ కిషన్ లక్నోలోని నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ పార్క్‌లో శుక్రవారం కన్నుమూసింది. ఈ చిరుత కొన్ని సంవత్సరాలుగా ఆ పార్క్ లోనే నివసిస్తోంది. వాస్తవానికి ఈ చిరుతను 2009 సంవత్సరం మార్చి 1వ తేదీన కిషన్‌పూర్ టైగర్ రిజర్వ్, కాన్ప్టాడా, దుధ్వా నేషనల్ పార్క్ నుండి పులిని రక్షించి ఇక్కడికి తీసుకొచ్చి సంరక్షిస్తున్నారు. 

త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: జ‌న‌వ‌రి 5న బీజేపీ రాష్ట్రవ్యాప్త ర‌థ‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న అమిత్ షా

ఈ కిషన్ 2008లో మానేటర్‌గా మారింది. అంటే మనుషులను చంపి, తినడానికి అలవాటు పడింది. దీంతో దానిని మానవ నివాసాలకు సమీపంలో ఉన్న బహిరంగ ప్రదేశాల నుంచి తరలించాల్సి వచ్చింది. కొన్ని నెలల తరబడి ఎంతో శ్రమించి దానిని జూకు తీసుకొని వచ్చారు. జూలాజికల్ పార్క్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మగ పులి కొన్ని రోజులుగా ఆహారం తీసుకోవడం లేదు. అలాగే పార్క్ ఆవరణలో కూడా తిరగడం లేదు. ఈ క్రమంలో శుక్రవారం తుది శ్వాస విడిచింది.

UP | Kishan,a male tiger,who was suffering from cancer passed away at Nawab Wajid Ali Shah Zoological Park in Lucknow y'day

The tiger was rescued from Kishanpur Tiger Reserve on March 1, 2009 &was brought to Zoological Park in Lucknow

(file pic source:Zoological Administration) pic.twitter.com/KnY7Wx5Ts7

— ANI (@ANI)

ఈ విషయంలో నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ పార్క్ డైరెక్టర్ వీకే మిష్ర్ మీడియాతో పలు వివరాలు వెల్లడించారు. పులిని రక్షించి తీసుకొచ్చిన తరువాత దానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ సమయంలోనే పులి హెమాంగియోసార్కోమా క్యాన్సర్‌తో బాధపడుతోందని గుర్తించారు. ఈ క్యాన్సర్ వల్ల ఓ కణితి ఏర్పడింది. అది చెవి, నోటి వరకు వ్యాపించింది. అందుకే అది సాధారణంగా పరిగెడుతూ వేటాడలేపోయింది. దీంతో సులభంగా దొరికే, ఇంటి పరిసరాల్లో కట్టేసి ఉన్న జంతువులను, మనుషులపై దాడి చేసి తినేందుకు నివాస ప్రాంతాల్లోకి వెళ్లేదని కనుగొన్నారు.

నీటితో నిండి ఉన్న క్వారీలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన

అయితే గత 13 సంవత్సరాలుగా జూలాజికల్ పార్క్‌లో పులిని అధికారులు సంరక్షిస్తున్నారు. దానికి ఆహారం అందిస్తూ వచ్చారు. అయితే టైగర్ కిషన్ క్యాన్సర్ తో బాధపడుతున్నప్పటికీ, అలాగే వృద్ధాప్యం వచ్చినా కూడా ఇతర పులిల మాదిరిగానే ప్రవర్తించేది. ఇదే పులి ఉంటున్న ఈ జూలో కజ్రీ అనే వృద్ధాప్య పులి కూడా నివసిస్తోంది. ఆ పులి ప్రస్తుతం సాధారణంనే ఆహారం తీసుకుంటోంది. అయితే దాని వయస్సు కారణంగా దాని ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని అధికారులు తెలిపారు.

click me!