త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌లు: జ‌న‌వ‌రి 5న బీజేపీ రాష్ట్రవ్యాప్త ర‌థ‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్న అమిత్ షా

By Mahesh RajamoniFirst Published Dec 31, 2022, 10:20 AM IST
Highlights

Agartala: వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో బీజేపీ రథయాత్రను జ‌న‌వ‌రి 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు.  రాష్ట్రంలో మళ్లీ అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ ఈ రాష్ట్రవ్యాప్త‌ ర‌థ‌యాత్ర‌ను చేప‌డుతోంది. 
 

Tripura BJP Rath Yatra: త్రిపుర‌లో అధికారం ద‌క్కించుకోవ‌డానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప‌క్కా ప్ర‌ణాళిక‌లు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర వ్యాప్త యాత్ర‌ను చేప‌డుతోంది. త్రిపుర బీజేపీ ర‌థ‌యాత్ర‌లో ఆ పార్టీ అగ్ర‌నేత‌లు పాలుపంచుకుంటార‌ని స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే.. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో బీజేపీ రథయాత్రను జ‌న‌వ‌రి 5న‌ కేంద్ర హోంమంత్రి అమిత్ షా జెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం సిద్ధ‌మ‌య్యాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా బీజేపీ ఈ రాష్ట్రవ్యాప్త‌ ర‌థ‌యాత్ర‌ను చేప‌డుతోంది. 

ఎనిమిది రోజుల యాత్రను ఉత్తర త్రిపుర జిల్లా ధర్మానగర్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదే రోజు దక్షిణ త్రిపుర జిల్లాలోని సబ్రూమ్లో కూడా అమిత్ షా ర్యాలీని నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భట్టాచార్జీ తెలిపారు. యాత్ర ముగింపు రోజైన జనవరి 12న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా త్రిపురలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రథయాత్రను అధికార పార్టీ 'జన విశ్వాస్ యాత్ర' గా అభివర్ణించింది. 'జన విశ్వాస్ యాత్ర' సందర్భంగా రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ సెగ్మెంట్లలో 10 లక్షల మంది ప్రజలను కలుపుకోవాలని పార్టీ భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలను హైలైట్ చేయడానికి 200 ర్యాలీలు, 100 కి పైగా ఊరేగింపులు ఉంటాయి" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పారు. 

కనీసం 10 మంది కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర నాయకులు రథయాత్రలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ రథయాత్ర అధికార పార్టీ అతిపెద్ద రాజకీయ కార్యక్రమాలలో ఒకటిగా రాష్ట్ర సమాచార, సాంస్కృతిక వ్యవహారాల (ఐసిఎ) మంత్రి సుశాంత చౌదరి అభివర్ణించారు. రథయాత్ర అగర్తలాలో ముగుస్తుందనీ, అక్కడ జేపీ నడ్డా, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్ వర్మ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తార‌ని తెలిపారు.

షెడ్యూల్ ప్రకారం, ఉత్తర త్రిపురలో ప్రారంభమయ్యే రథయాత్ర ధర్మనగర్ నుండి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. దక్షిణ త్రిపుర నుండి ప్రారంభమయ్యేది సబ్రూమ్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 56 నియోజక వర్గాల్లో ప్రయాణించి 1,000 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని అంచనా వేయగా, మిగిలిన నాలుగు నియోజకవర్గాల నుంచి ప్రత్యేక రథాలు బయలుదేరి, ప్రధాన యాత్రలో చేరి అగర్తల వద్ద కలుస్తాయని భట్టాచార్జీ చెప్పారు. అగర్తల వద్ద.

పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని పెంచేందుకు తమ పార్టీ 200 సమావేశాలు, 100 పాదయాత్రలు, 50 రోడ్ షోలు స‌హా ఇతర కార్యక్రమాలను ప్లాన్ చేసినట్లు భట్టాచార్జీ చెప్పారు. రాష్ట్రంలోని కనీసం 10 లక్షల మంది ప్రజలతో మమేకమయ్యేలా ఈ యాత్రను నిర్వహించినట్లు బీజేపీ సీనియర్ నేత, సమాచార, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుశాంత చౌదరి తెలిపారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ రక్షిత్, సీనియర్ నాయకుడు టింకూ రాయ్ వరుసగా ఉత్తర-దక్షిణ త్రిపుర జిల్లాలలో ప్రారంభమయ్యే యాత్రలకు ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకుని వెళ్లేందుకు పార్టీ ఎమ్మెల్యేలందరినీ యాత్రకు ట్యాగ్ చేశార‌ని తెలిపారు. 

click me!