
కొన్ని వివాహాలు సమాజంలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతాయి. అందుకు ఆ వివాహాలు.. సాధారణం కంటే భిన్నంగా ఉండటమే కారణాలుగా నిలుస్తాయి. అలాంటి వివాహామే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో చోటుచేసుకుంది. ఈ వివాహం వార్తల్లో నిలవడానికి కారణం.. వరుడు ఇద్దరు యువతులను ప్రేమించి.. వారితో ఇద్దరు పిల్లలను కన్న తర్వాత.. ఒకే వేదికపై వారిద్దని పెళ్లి చేసుకోవడమే. ఇందుకు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అంగీకరించడం గమనార్హం. గ్రామస్తులు సమక్షంలోనే జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
కేశ్‌కాల్ ప్రాంతంలోని ఇరగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్ సింగ్.. తన గ్రామానికి సమీపంలోని అండేగా గ్రామంలో నివసిస్తున్న దుర్గేశ్వరీ మార్కమ్ అనే యువతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే యువతితో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. అయితే కొద్ది రోజులకే దుర్గేశ్వరీ.. రంజన్ సింగ్ ఇంటికి వచ్చి అక్కడే ఉండసాగింది. పెళ్లి కాకముందే.. అతడి ఇంటికి వచ్చి ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. ఇక, కొన్ని నెలల తర్వాత దుర్గేశ్వరీ ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది.
అయితే ఈ సమయంలోనే రంజన్ సింగ్.. అయోన్వారి గ్రామానికి చెందిన సన్నోబాయి గోటాతో ప్రేమలో పడ్డాడు. ఈ క్రమంలోనే సన్నో గర్భం దాల్చింది. ఆమె కూడా ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో తీవ్ర చర్చ సాగింది. ఈ క్రమంలోనే గ్రామ పెద్దలు.. రంజన్ సింగ్ కుటుంబంతో పాటు, యువతుల కుటుంబాలతో కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే పంచాయితీ నిర్వహించగా.. తాను ప్రేమించిన సన్నో, నిశ్చితార్థం చేసుకున్న దుర్గేశ్వరీలను వివాహనం చేసుకునేందుకు రంజన్ సింగ్ అంగీకరించాడు. ఇందుకు పెద్దలు కూడా ఒకే చెప్పడంతో.. రంజన్ సింగ్ ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు.
ఈ వివాహం చాలా బాగా జరిగిందని.. వేడుకకు దాదాపు 600 మంది వరకు హాజరయ్యారని గిరిజన సంఘంకు చెందిన సోనూరామ్ మాండవి చెప్పారు. ఇక, పెళ్లి వేడుకలో ఇద్దరు యువతులు.. వారి బిడ్డలను ఒళ్లో కూర్చొబెట్టుకుని కల్యాణ మండపంలో కూర్చున్నారు. ఇక, తనకు పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతు నుంచి ఒక్కో బిడ్డ ఉందని.. ఇద్దరు పిల్లలు కూడా ఈ వివాహానికి సాక్ష్యంగా మారారని రంజన్ చెప్పాడు.