ప‌గ‌బ‌ట్టిన ఏనుగు.. వృద్ధురాలిని తొక్కి చంపి.. అంత్య‌క్రియ‌ల‌కు వ‌చ్చి, చితిపై నుంచి శ‌వాన్ని విసిరేసి..

Published : Jun 12, 2022, 06:32 AM IST
ప‌గ‌బ‌ట్టిన ఏనుగు.. వృద్ధురాలిని తొక్కి చంపి.. అంత్య‌క్రియ‌ల‌కు వ‌చ్చి, చితిపై నుంచి శ‌వాన్ని విసిరేసి..

సారాంశం

ఓ ఏనుగు వృద్ధురాలిని తొక్కి చంపింది. అంత్యక్రియలు నిర్వహించే చోటుకు ఆకస్మికంగా వచ్చి చితిపై నుంచి శవాన్ని తీసుకెళ్లింది. తరువాత మృత‌దేహంపై మళ్లీ దాడి చేసి దానిని కోపంతో విసిరిపారేసింది. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. 

మూగ జీవాలు పగబడతాయా ? అని మ‌నం ఎవ‌రినైనా ప్ర‌శ్నిస్తే భిన్న ర‌కాల స‌మాధానాలు వ‌స్తాయి. అవున‌ని కొంద‌రంటే.. అలాంటిదేమీ ఉండ‌ద‌ని మ‌రికొంద‌రంటారు. అవున‌నే వారు దానికి బ‌లాన్ని చేకూర్చేందుకు కొన్ని ఘ‌ట‌న‌లు వివ‌రిస్తే.. కాద‌నే వారు ‘‘అబ్బే అదంతా ట్రాష్.. అవేదో కో ఇన్సిడెన్స్ లో జ‌రిగాయి’’ అని వాదిస్తారు. సరే ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా.. తాజాగా ఒడిశాలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న మాత్రం జంతువులు ప‌గ‌బ‌డ‌తాయ‌ని..గుర్తుంచుకొని మ‌రీ దాడి చేస్తాయ‌ని చెప్పే వారి వాద‌న‌కు బ‌లానిస్తోంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే ? 

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో మాయా ముర్ము అనే 70 ఏళ్ల వృద్ధురాలు గురువారం ఉదయం రాయపాల్ గ్రామంలోని గొట్టపు బావి నుండి నీళ్లు తీసుకువ‌స్తోంది. ఇదే స‌మ‌యంలో దాల్మా వన్యప్రాణుల అభయారణ్యం నుండి సంచరిస్తున్న ఓ అడ‌వి ఏనుగు ఆమెపై దాడి చేసింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంట‌నే ఆమెను ప‌లువురు హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ వృద్ధురాలు కావ‌డం, ఏనుగు బ‌లంగా దాడి చేయ‌డం వ‌ల్ల ఆమె చికిత్స పొందుతూ ప‌రిస్థితి విష‌మించి చనిపోయింది. 

ఎనిమిదేళ్లలో ప్రపంచంలో భారత్ గౌరవాన్ని మోడీ ప్రభుత్వం పునరుద్ధరించింది : అమిత్ షా

మాయా ముర్ము హాస్పిట‌ల్ లో చనిపోవ‌డంతో ఆమె మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు గ్రామ‌స్తులు, బంధువులు ఇంటికి తీసుకొచ్చారు. మృత‌దేహానికి ఇంటి వ‌ద్ద చేయాల్సిన కార్య‌క్ర‌మాలు అన్నీ నిర్వ‌హించారు. సాయంత్రం స‌మ‌యంలో పాడెపై ఎక్కించుకొని చితి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. మృత‌దేహాన్ని చితిపై ఉంచ‌గానే మ‌ళ్లీ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌దు గానీ.. వృద్ధురాలిపై దాడి చేసిన ఏనుగు ఆక‌స్మికంగా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మైంది. దానిని చూసిన గ్రామ‌స్తులు, బంధువులు ఖంగుతిన్నారు. ఆ ఏనుగు నేరుగా చితి వ‌ద్ద‌కు అక్క‌డి నుంచి తీసుకెళ్లింది. మ‌ళ్లీ ఆమె శ‌రీరాన్ని తొక్కి, విసిరిపారేసింది. 

కొంత స‌మ‌యం త‌రువాత ఏనుగు అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. గ్రామ‌స్తులు, బంధువులు అక్క‌డికి వెళ్లి మృత‌దేహాన్ని తీసుకొచ్చి కొంత స‌మ‌యం త‌రువాత అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు. రస్‌గోవింద్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ లోపాముద్ర నాయక్ మాట్లాడుతూ.. ఏనుగు దాడిలో వృద్ధురాలు మ‌ర‌ణించింద‌ని, త‌రువాత సాయంత్రం అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో మ‌ళ్లీ వ‌చ్చి దాడి చేసింద‌ని తెలిపారు. ఏనుగు వెళ్లిపోయిన కొన్ని గంట‌ల త‌రువాత మ‌ళ్లీ ద‌హ‌న సంస్కారాలు పూర్తి చేశార‌ని పేర్కొన్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. 

Saharanpur violence: సహరన్‌పూర్ హింస ఘ‌ట‌న.. నిందితుల అక్రమ ఆస్తుల కూల్చివేత‌.. 64 మంది అరెస్టు..

మ‌రో ఘ‌ట‌న‌లో ఇదే ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో 55 ఏళ్ల వ్యక్తిని గ‌తేడాది డిసెంబ‌ర్ లో ఏనుగులు తొక్కి చంపాయి. మొరోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రాడ సమీపంలోని అడవిలో ముగ్గురు గిరిజనులు ఇంటికి తిరిగి వ‌స్తున్నారు. ఈ సమ‌యంలో 14 ఏనుగుల గుంపుకు హఠాత్తుగా వ‌చ్చి వీరిపై దాడి చేశాయి. ఇందులో శంభువా భక్త (55) మరణించారు. మరో ఇద్దరు గాయాలతో త‌ప్పించుకున్నారు. ఇవి కూడా జార్ఖండ్‌లోని దాల్మా అభయారణ్యం నుంచి దారి త‌ప్పి వ‌చ్చాయి. బరిపాడ అటవీ డివిజన్ పరిధిలోని రాస్‌గోవింద్‌పూర్ పరిధిలోకి చొర‌బడ్డాయి. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం