పక్కింటి కుర్రాడితో వివాహిత అక్రమ సంబంధం.. చివరికి..

Published : Mar 10, 2021, 08:51 AM IST
పక్కింటి కుర్రాడితో వివాహిత అక్రమ సంబంధం.. చివరికి..

సారాంశం

ఆ కుర్రాడితో కలిసి వేరే ప్రాంతానికి పారిపోయి.. అక్కడే సహజీవనం చేయడం మొదలుపెట్టింది. 

ఆమెకు అప్పటికే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. భర్త ని కాదని పక్కింటి కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..  ఆ కుర్రాడితో కలిసి వేరే ప్రాంతానికి పారిపోయి.. అక్కడే సహజీవనం చేయడం మొదలుపెట్టింది. అయితే.. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరినీ హతమార్చాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రామనాథపురం జిల్లా, నయినార్‌కోవిల్‌ సమీపం మనిచ్చియేందల్‌కు చెందిన సత్యేంద్రన్‌ (28). ఇతనికి శివగంగై జిల్లా, మానామదురైకి చెందిన వలర్మతి (22)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సత్యేంద్రన్‌ తిరుచ్చిలోని దుకాణంలో పనిచేస్తూ వచ్చాడు. వలర్మతికి పక్కింటికి చెందిన వేల్‌రాజ్‌ (20)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.  వీరిద్దరూ గత మూడో తేదీన ఇంటి నుంచి పరారై తిరుచ్చి ధారానల్లూరు ప్రాంతంలో సహజీవనం సాగిస్తున్నారు. విషయం తెలిసి సత్యేంద్రన్, తమ్ముడు ప్రభు, స్నేహితులతో కలిసి వలర్మతి, వేల్‌రాజ్‌పై దాడి చేశారు. దాడిలో వేల్‌రాజ్, వలర్మతి మృతిచెందారు. సత్యేంద్రన్‌ పోలీసులకు లొంగిపోయాడు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !