పెళ్లైన మేనకోడలితో ఎఫైర్.. మోసం చేసిందని..

Published : Mar 10, 2021, 08:22 AM ISTUpdated : Mar 10, 2021, 08:24 AM IST
పెళ్లైన మేనకోడలితో ఎఫైర్.. మోసం చేసిందని..

సారాంశం

భర్తకి తెలీకుండా మేనమామ వినీత్ తో ఎఫైర్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గత నెల ఫిబ్రవరి 14 న ఇంట్లోవారికి తెలీకుండా.. మేనమామ తో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. 

ఓ వ్యక్తి తన సొంత మేనకోడలిని అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా... తనను మోసం చేసిందని అందుకే చెప్పానని ఆయన చెప్పడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దిబాయ్ పూర్ ప్రాంతానికి చెందిన వినీత్ అనే వ్యక్తి తన సొంత మేనకోడలు(26) తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కాగా... అప్పటికే సదరు యువతికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

అయినప్పటికీ... భర్తకి తెలీకుండా మేనమామ వినీత్ తో ఎఫైర్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గత నెల ఫిబ్రవరి 14 న ఇంట్లోవారికి తెలీకుండా.. మేనమామ తో కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. అతనితోనే ఉండటం మొదలుపెట్టింది. అయితే... భర్త, అతని కుటుంబసభ్యులు ఆమె ఎక్కడ ఉందో కనుక్కొని.. బలవంతంగా ఇంటికి తీసుకువచ్చారు.

కాగా.. తనను వదిలేసి మేనకోడలు.. ఇలా వచ్చేయడాన్ని వినీత్ తట్టుకోలేకపోయాడు. తనను మోసం చేసిందంటూ.. ఆమె అత్తారింటికి వెళ్లి.. కత్తితో పొడిచేశాడు. గమనించిన కుటుంభస్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. వైద్యం అందిస్తుండగానే.. ఆమె చనిపోయింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Mid Day Meal: మ‌ధ్యాహ్న భోజ‌నంలో చికెన్ బిర్యానీ.. ప‌రిశీలిస్తోన్న రాష్ట్ర ప్ర‌భుత్వం
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఈ బిల్లుతో ఏం జరగనుంది.?