మత్స్యశాఖ వివాదం.. రాహుల్‌‌ను స్కూల్‌కి పంపండి: కేంద్ర మంత్రి గిరిరాజ్ సెటైర్లు

By Siva KodatiFirst Published Mar 9, 2021, 6:36 PM IST
Highlights

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఇటీవల మత్స్యశాఖకు మంత్రిత్వ శాఖ వుండాలంటూ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెటైర్లు వేశారు. రాహుల్‌ను స్కూల్‌కు పంపాలంటూ చురకలు వేశారు.

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ఇటీవల మత్స్యశాఖకు మంత్రిత్వ శాఖ వుండాలంటూ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సెటైర్లు వేశారు. రాహుల్‌ను స్కూల్‌కు పంపాలంటూ చురకలు వేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖలు, ఏయే విభాగాలో ఉంటాయో ఆయన తెలుసుకోవాలంటూ ఎద్దేవా చేశారు.

మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం పరిధిలో ఏయే మంత్రిత్వశాఖలు, విభాగాలు ఉంటాయో రాహుల్‌ తెలుసుకోవాలని సూచించారు. ఇదే విషయం గతంలో తాను చెప్పినా ఆయన గుర్తుపెట్టుకోవడం లేదంటూ కేంద్రమంత్రి ఫైరయ్యారు.

ఇప్పటికే పశుసంవర్థకం, డెయిరీ శాఖలో భాగంగా ఉందని గిరిరాజ్ చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాహుల్‌ ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్‌ మళ్లీ స్పందిస్తూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో మధ్యలో కలగజేసుకున్న గిరిరాజ్‌ .. మోడీ అధికారంలోకి వచ్చాక మత్స్యరంగం 10.87 శాతం వృద్ధి సాధించిందని, కాంగ్రెస్‌ హయాంలో ఇది 5.27 శాతంగా మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు.  

కాగా, ఇటీవల కేరళ, పుదుచ్చేరి పర్యటన సందర్భంగా మత్స్య రంగానికి మంత్రిత్వశాఖ ఉండాలని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనిని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఇతర మంత్రులు సైతం తప్పుబట్టారు.

click me!