
ఓ వ్యక్తి తన బంధువును దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని చిక్కజాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి సందీప్ కుమార్ కాగా, అతని కజిన్ సుబోధ్ మండల్ ఈ హత్యకు పాల్పడ్డాడు. వీరిద్దరూ కూడా బీహార్‌కు చెందినవారే. వివరాలు.. సందీప్ చాలా ఏళ్ల క్రితం కూలీ పని చేసేందుకు బెంగళూరు వచ్చాడు. సందీప్‌కు పెళ్లైంది. అతని భార్య బీహార్‌లో ఉంటుంది. చిక్కజాల సమీపంలోని బిల్లమారనహళ్లిలో నివాసం ఉంటున్నాడు. ఓ గదిలో స్నేహితులతో కలిసి నివాసం ఉండేవాడు.
సుబోధ్ కూడా కొంతకాలం క్రితమే బెంగళూరు వచ్చాడు. ఈ సమయంలో సుబోధ్ తరచూ తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని సందీప్‌కు తెలిసింది. ఈ క్రమంలోనే తన భార్యతో సుబోధ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సందీప్ అనుమానించాడు. ఈ విషయంపై సుబోధ్‌తో సందీప్ గొడవకు దిగాడు. తన భార్యతో మాట్లాడవద్దని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది.
అయితే శుక్రవారం రాత్రి మద్యం సేవించిన సమయంలో ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గొడవ అనంతరం నిద్రిస్తున్న సందీప్ కుమార్‌పై సుబోధ్ దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే 24 గంటల పాటు సందీప్ మృతదేహం అక్కడే ఉంది. శనివారం రాత్రి సందీప్ స్నేహితుడి గదికి వచ్చి చూడగా అతడు మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం చిక్కజాల పోలీసులు విచారణ జరిపి హత్యకు సంబంధించిన అసలు విషయాన్ని బయటపెట్టారు.
సందీప్‌ను హత్య చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు సుబోధ్ మండల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిక్కజాల పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.