రెండేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..

Published : Aug 02, 2023, 05:14 PM IST
రెండేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. సంచలన తీర్పునిచ్చిన కోర్టు..

సారాంశం

రెండేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 23 ఏళ్ల యువకుడికి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది.  బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

గుజరాత్‌లో కామంతో కన్నుమిన్నూ కానక.. రెండేళ్ల పసిపాపపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డిన కీచకుడుకి  సూరత్ కోర్టు షాక్ ఇచ్చింది. దారుణానికి పాల్పడిన యువకుడికి అదనపు సెషన్స్ జడ్జి మరణశిక్ష విధించింది. అలాగే.. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.  

వివరాల్లోకెళ్తే.. రెండేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 23 ఏళ్ల యువకుడికి గుజరాత్‌లోని సూరత్ నగరంలోని కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది. అదనపు సెషన్స్ జడ్జి శకుంతలా సోలంకి .. నిందితుడు యూసుఫ్ ఇస్మాయిల్‌కు మరణశిక్ష విధించారు . అలాగే.. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 376, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఇస్మాయిల్ దోషిగా నిర్థారించారు.  నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది, ఇది అరుదైన కేసు అని పేర్కొంది.

ఈ ఘటన సూరత్‌లోని సచిన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కప్లేతా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రికి ఇస్మాయిల్ స్నేహితుడు. ఫిబ్రవరి 27న ఇస్మాయిల్‌ ఆమెకు భోజనం, పానీయం ఇప్పిస్తానని చెప్పి సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసి కత్తితో నరికి చంపాడు. మృతదేహాన్ని పొలంలో పడేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. మరుసటి రోజే అతన్ని అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?