Coronavirus: బ‌య‌ట రెండు సార్లు నెగ‌టివ్‌.. ఎయిర్ పోర్టులో క‌రోనా పాజిటివ్‌.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 30, 2022, 11:38 AM IST

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. అయితే, క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు ప‌లువురు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో కోవిడ్‌-19 వ్యాప్తి అధికం అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా ప‌రీక్ష చేయించుకోగా నెగ‌టివ్ వ‌చ్చిన వ్యక్తికి.. ఎయిర్‌పోర్టులో పాజిటివ్ గా వ‌చ్చింది. మ‌ళ్లీ అక్క‌డే వెంట‌నే కోవిడ్‌-19 ప‌రీక్ష చేయించుకోగా ఈ సారి నెగ‌టివ్ వ‌చ్చింది. ఇలా ఇష్టానుసారంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్ల‌క్ష్యంగా నిర్వ‌హిస్తున్న మరో ఘ‌ట‌న బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో చోటుచేసుకుంది. 
 


Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. అయితే, క‌రోనా క‌ట్ట‌డి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లను ప‌లువురు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో కోవిడ్‌-19  వ్యాప్తి అధికం అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట క‌రోనా (Coronavirus) పరీక్ష చేయించుకోగా నెగ‌టివ్ వ‌చ్చిన వ్యక్తికి.. ఎయిర్‌పోర్టులో పాజిటివ్ గా వ‌చ్చింది. మ‌ళ్లీ వెంట‌నే కోవిడ్‌-19 ప‌రీక్ష చేయించుకోగా ఈ సారి నెగ‌టివ్ వ‌చ్చింది. ఇలా ఇష్టానుసారంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్ల‌క్ష్యంగా నిర్వ‌హిస్తున్న ఘ‌ట‌న బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో మ‌రో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళ్తే.. క‌ర్నాట‌క‌లో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తోంది. నిత్యం వేల‌ల్లోనే కొత్త (Coronavirus) కేసులు, డ‌జ‌న్ల సంఖ్య‌లో కోవిడ్ మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం క‌రోనా ఆంక్ష‌లు క‌ఠిన‌త‌రం చేస్తూ.. వైర‌స్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. 

ఈ నేప‌థ్యంలోనే బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి  విదేశాలకు వెళ్లాలన్నా, రావాలన్నా అక్కడి కోవిడ్‌-19 (Coronavirus) టెస్ట్ సెంట‌ర్ల‌లో ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు తప్పనిసరి చేసింది క‌ర్నాట‌క స‌ర్కారు. అయితే, ప‌రీక్ష‌లు నిర్వ‌హించే సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, ఈ టెస్టులు చేసే సిబ్బంది ఇష్టానుసారం రిపోర్టులు ఇస్తున్నారని గ‌త కొంత కాలంగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇదివ‌ర‌కే ప‌లుమార్లు వెలుగు చూశాయి. ఇదే త‌ర‌హాలో మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌కి వెళ్లాల్సిన ఒక యువకుడు క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌లు చేయించుకోగా.. నెగ‌టివ్ వ‌చ్చింది. ఈ రిపోర్టుల‌ను తీసుకుని కెంపేగౌడ ఎయిర్‌పోర్టు వ‌చ్చాడు. అయితే, బ‌య‌ట చేయించుకున్న రిపోర్టుల‌తో సంబంధం లేకుండా ఎయిర్ పోర్టులో కూడా మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది రాష్ట్ర ప్ర‌భుత్వం. 

Latest Videos

undefined

ఈ క్ర‌మంలోనే ఆ యువ‌కుడు కెంపేగౌడ విమానాశ్ర‌యంలో క‌రోనావైర‌స్ (Coronavirus) ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. అక్క‌డి సిబ్బంది కోవిడ్‌-19 పాజిటివ్‌ అని రిపోర్టులు ఇచ్చారు. అయితే, అంతకుముందే ఆ యువ‌కుడు  బయట క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా నెగెటివ్‌ వచ్చింది. మళ్లీ బయట టెస్టు చేస్తే నెగెటివ్‌గా తేలింది.  వెంట‌వెంట‌నే చేయించుకున్న క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌ల్లో బ‌య‌ట రెండు సార్లు నెగ‌టివ్ రాగా, ఎయిర్ పోర్టులో మాత్రం పాజిటివ్ గా రావ‌డంపై అనుమానం క‌లిగిన యువ‌కుడు.. తన కుటుంబ సభ్యులతో ఎయిర్‌పోర్టుకు వచ్చి తనకు  కోవిడ్ టెస్టు చేసిన సిబ్బందిని నిలదీశాడు. ఆ సమయంలో కోవిడ్‌-19 సిబ్బంది మ‌ద్యం మ‌త్తులో ఉండ‌టం గ‌మనించారు.  సిబ్బంది మద్యం మత్తులో ఉండడంతో గొడవ పెరిగింది. (Coronavirus) తప్పుడు నివేదిక వల్ల దుబాయ్‌కి వెళ్లలేకపోయానని, ఆ నష్టాన్ని ఎవరు తీరుస్తారని బాధిత యువకుడు వాపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుత‌న్నాయి.  కాగా, ఇక్క‌డి ల్యాబ్ సిబ్బంది క‌రోనా (Coronavirus) ప‌రీక్ష‌ల విష‌యంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, అడిగినంత డబ్బులను ముట్టజెబితే ఎలా కావాలంటే అలా రిపోర్టులు ఇస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. 

ఇదిలావుండగా, కర్నాటకలో కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 37,57,031 కరోనా (Coronavirus) కేసులు నమోదయ్యాయి. అలాగే, 38,874 మంది వైరస్ (Coronavirus) కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 

click me!