నైట్ కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘన: టీవీ నటులపై కేసు

By narsimha lodeFirst Published Jan 30, 2022, 11:27 AM IST
Highlights

నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించారని బెంగుళూరులోని కెంగేరి పోలీస్ స్టేషన్ లో టీవీ నటుడు రక్షిత్ గౌడ సహా ఆయన స్నేహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగుళూరు: Night Curfew  నిబంధనలను ఉల్లంఘించారని TV Artist  Rakshit Gowda, అతని స్నేహితులపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నెల 27వ తేదీన జింజర్ లేక్ వయూ రెస్టారెంట్  లో నైట్ కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించి పార్టీ చేసుకొన్నందుకు  కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. రక్షిత్ గౌడతో పాటు అతని స్నేహితులు, అభిషేక్ రంజన్,రవిచంద్రన్, రాకేష్ కుమార్, శరణ్య, అనూషలపై కెంగేరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. విపత్తుల చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గురువారం నాడు తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులుత గొడవకు దిగుతున్నారని పోలీసులకు సమాచారం అందింది.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు రెస్టారెంట్ వద్దకు వెళ్లిన సమయంలో ఈ పార్టీ వ్యవహరిం వెలుగు చూసింది.

నైట్ కర్ఫ్యూ నిబంధనలన ఉల్లంఘించిన రక్షిత్ గౌడతో పాటు అతని స్నేఁహితులను పోలీసులు  Kengeri పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తమ షూటింగ్ పూర్తి చేసుకొన్న తర్వాత రెఃస్టారెంట్ వద్దకు వచ్చినట్టుగా రక్షిత్ గౌడ పోలీసుల విచారణలో తెలిపాడు.తాము ఉత్తరహళ్లి ప్రధాన రోడ్డులో  పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రెస్టారెంట్ సమీపంలో గొడవ విషయమై సమాచారం అందిందని కెంగేరి ఎస్ఐ నాగరాజు మీడియాకు చెప్పారు.  రెస్టారెంట్ వద్దకు వెళ్లిన సమయంలో ఐదుగురు పురుషులు, ఇద్దరు రెస్టారెంట్ వద్ద అరుస్తూ కన్పించారని Nagaraju చెప్పారు. 

కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28 నుండి రాత్రి పూట కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చింది. అంతేకాదు ఈ ఏడాది  జనవరి 5వ తేదీ నుండి వీకేండ్ కర్ఫ్యూను కూడా అమలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

దేశంలో  గ‌త 24 గంట‌ల్లో  క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెరిగాయి. కొత్త‌గా 893 మంది క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం క‌రోనా మర‌ణాల సంఖ్య 4,94,091 పెరిగింది. ఇదే సమయంలో 2,34,281 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా వైరస్ బారినపడ్డవారి సంఖ్య 4,10,92,522 చేరుకుంది. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం 18,84,937 క్రియాశీల కేసులు ఉన్నాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,52,784 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్  నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,87,13,494కు పెరిగింది. 

మొత్తం Corona కేసుల్లో యాక్టివ్ కేసులు సంఖ్య 4.59 శాతంగా ఉంది. క‌రోనా రిక‌వ‌రీ రేటు 94.21 శాతానికి చేరుకుంది. అయితే, రోజువారీ పాజిటివిటీ రేటు 13 శాతం నుంచి 14.50 శాతానికి పెరగ‌డంపై ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది. డైలీ పాజిటివిటీ రేటు 14.50 శాతంగా ఉండ‌గా, వారాంత‌పు క‌రోనా పాజిటివిటీ రేటు 16.40 శాతంగా ఉంది. క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు క‌ఠినంగా అమలు చేస్తున్నారు. 


 

click me!