మలద్వారంలో రూ.42 లక్షల విలువైన బంగారం దాచి స్మగ్లింగ్.. ఎక్స్ రేలో షాకింగ్ విషయం.. !

Published : Sep 29, 2021, 09:44 AM IST
మలద్వారంలో రూ.42 లక్షల విలువైన బంగారం దాచి స్మగ్లింగ్.. ఎక్స్ రేలో షాకింగ్ విషయం.. !

సారాంశం

తాజాగా ఇలాగే బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడో ప్రయాణికుడు.. అతని దగ్గర దొరికిన బంగారంకంటే... స్మగ్లింగ్ కోసం దాన్ని దాచిపెట్టిన ప్రదేశం కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేసింది. 

న్యూఢిల్లీ : బంగారం స్మగ్లింగ్ (Gold Smuggling) ను అరికట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంత గట్టి నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు రోజుకో కొత్త దారి తొక్కుతున్నారు. స్మగ్లింగ్ లో క్రియేటివిటీ చూపిస్తున్నారు. కొన్నిసార్లు వారి పాచికలు పారుతున్నా.. మరికొన్ని సార్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఈ స్మగ్లింగ్ ఐడియాలు ఎంతవరకు దారి తీస్తున్నాయంటే.. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం జరిగేంతగా మారుతున్నా వీరు ఈ పనిని మానుకోకపోవడం విషాదం.

తాజాగా ఇలాగే బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడో ప్రయాణికుడు.. అతని దగ్గర దొరికిన బంగారంకంటే... స్మగ్లింగ్ కోసం దాన్ని దాచిపెట్టిన ప్రదేశం కస్టమ్స్ అధికారులను షాక్ కు గురి చేసింది. 

సోమవారం ఇంఫాల్ విమానాశ్రయం(Imphal Airport)లో ఓ ప్రయాణికుడి  దగ్గర 900 గ్రాముల బరువున్న.. సుమారు రూ. 42 లక్షల విలువ చేసే బంగారు పేస్ట్ ను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)స్వాధీనం చేసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 909.68 గ్రాముల బరువున్న నాలుగు మెటల్ పేస్ట్ ప్యాకెట్లను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు.

CISF సబ్-ఇన్స్‌పెక్టర్ బి దిల్లీ దీని గురించి చెబుతూ.. ఒక ప్రయాణికుడిని పరీక్షిస్తున్నప్పుడు అతని మల కుహరం లోపల మెటల్ ఉండటం గమనించారు.. దీంతో వెంటనే అతన్ని గట్టిగా ప్రశ్నించగా.. విషయం బయట పడింది.  అతని మల కుహరంలో 909.7 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి నాలుగు ప్యాకెట్లలో దాచాడు.

ఒకే యువకుడితో.. ముగ్గురు అక్కాచెల్లెళ్లు పరార్..!

అతని పేరు మహ్మద్ షెరీఫ్‌గా అని,  ఈ ప్రయాణీకుడు కేరళలోని కోజికోడ్‌లో ఉంటాడని తేలింది. మంగళవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఇంఫాల్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అతడి మీద అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని ప్రశ్నించడం కోసం  సెక్యూరిటీ హోల్డ్ ఏరియా నుంచి తీసుకెళ్లారు కానీ అక్కడ అతను వారు అడిగిన ప్రశ్నలకు "సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోయారు" అని అధికారులు తెలిపారు.

దీంతో అతని నడుం కింది భాగాన్ని ఎక్స్-రే తీయడం కోసం అధికారులు అతడిని మెడికల్ టెస్ట్స్ రూం కి తీసుకెళ్లారు. ఆ ఎక్స్ రేలో తేలిన విషయం వారిని షాక్ కు గురి చేసింది.. ఎక్స్ రేలో అతని శరీరం లోపల లోహ వస్తువులు ఉన్నట్టు చూపించింది, దీంతో వారు మరింత గట్టిగా ప్రశ్నించడంతో ఆ   ప్రయాణికుడు అసలు విషయం ఒప్పుకున్నాడని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

వెంటనే ఈ సమాచారం CISF,  కస్టమ్స్ సీనియర్ అధికారులకు అందించారు. వారు వచ్చి ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి నుంచి స్మగ్లింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే క్రమంలో అధికారులు ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Why People Share Everything on WhatsApp Status? | Psychology on WhatsApp Status| Asianet News Telugu
Cigarette Price: 20 రూపాయ‌లున్న సిగ‌రెట్ ధ‌ర ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత ఎంత కానుందో తెలుసా.?